Sunday, May 17, 2015

"గాంధీ"

ఆడిగాడు నన్ను ప్రశ్న కొరియా దేశస్తుడు..   
ఏ దేశం నీదని ?
కుతూహలముతో కూడిన....ఆత్మీయతతో 
మర్యాదపు భాషలో ..అడిగాడు ....
బదులిచ్హా..నేను "ఇండియన్" అని...   ( అర్థం కాలేదు )

ఇంగ్లీషు తనకి రాదు
నాకు తన భాష రాదు
సైగలే భాషలాయె మా ఇద్దరి మధ్య 
మళ్ళీ బదులిచ్హా "ఇండియన్" అని... ( అర్థం కాలేదు )          

రెండు క్షణములు.. నిడివి.
మిరుమిట్లు గొలిపేలా మెరిసెను తన మోము ..  
బ్రొటన వ్రేలితో "Thumsup" చెబుతూ చెప్పాడు .."గాంధి" అని...    
- శరత్      

Saturday, March 21, 2015

ఉగాది శుభాకాంక్షలు...

మన్మధ నామం
ఇది మల్లెల బాణం
జగమంతా నింపునులే ప్రేమ సుగంధం 
ఉగాది నవ వసంతం !
స్వాగతం సుస్వాగతం !!

ఉగాది శుభాకాంక్షలు...

- శరత్

Thursday, January 15, 2015

సంక్రాంతి శుభాకాంక్షలు


భోగ భాగ్యాల దీవెనలు
మోసుకొచ్హు భోగి పళ్ళు,   
రంగుల ముంగిళ్ళతో..
విరిసే సరికొత్త హరివిల్లు,
సాంప్రదాయాల వెల్లువతో..
మురిసే సంక్రాంతి సరదాలు, 
కలకాలం మదిలో నిలిచే కనువిందు చిత్రాలు..

సంక్రాంతి శుభాకాంక్షలు 

- శరత్ 

Wednesday, December 31, 2014

Happy New Year - 2015

నవ్వుల గలగల తో ..
వెలుగుల సిరి తో 
శుభవసంతమై..రావా..నవ వసంతమా !!
కోట్ల కలల ఆశలు 
పసిపాపల కేరింతలు
విశ్వశాంతి కపోతాలు  
నిర్విరామము గా సాగే 
శుభవసంతమై..రావా..నవ వసంతమా !!


- శరత్

Wednesday, January 1, 2014

Happy New Year 2014

ఈ నవవసంతం నాంది పలుకనీ 
నవ్వులు చెరగని నవ బంధాలకు
మంచిని కోరే మహాశయాలకు 
మార్పును తెచ్హే మహోపకరణాలకు !!

శుభ వసంతమై స్వాగతించనీ
శాంతిని పంచే సమానత్వాన్ని  
సుస్థిరమైన మానవత్వాన్ని
విశ్వవిజయ వికాసాన్ని.... 

"Welcome Happy New Year 2014"

శరత్

Wednesday, May 15, 2013

అమ్మ (mother)

"అమ్మ" పదములోన ఏదో  తన్మయత్వము     
అమ్మ చేతిలోన ఉండు లాలిత్యము   
అమ్మ మనసులోన ఉండు దైవత్వము 
అమ్మ తోనే కదా స్రుష్టికి ఆది పరిచయము       
అమ్మ అందుకే అత్యంత అపురూపము.. 
- శరత్

Thursday, April 11, 2013

"విజయ" నామ "ఉగాది" !!! (ugaadi)

కొత్త చిగురు వచ్హెనని కోకిలమ్మ పాట 
కొత్త తలపు రాగానే మనసంతా ఊరట 
"విజయ" వసంతం వచ్హిన ఈ ఉగాది పూట
తెలుగువారి ప్రతి ఇంట పెద్ద ముచ్హట !! 
విజయమే మెండుగా దరి చేరాలంట !!!   

- శరత్

Friday, March 29, 2013

హోళి పండుగ

హంగుల హోళి వచ్హెను నేడు 
రంగుల కళనే తెచ్హెను చూడు
అందరు కలసి ఆనదం తో ఆడు పాడు !!
సాంప్రదాయలు తొణికిసలాడె ఈ పండుగ నాడు
- శరత్

Saturday, March 9, 2013

సైనికులారా !!! ( A Salute to Indian Army )

సైనికులారా సాహసులారా !!
"దేశభక్తి" స్ఫూర్తి నింపు నాయకులారా..!! [ 2 ]   

హ్రుదయాన  నింపుకొని హిమాలయపు విశాలం..  
భాధ్యతగా స్వీకరించి దేశరక్షణం  
ప్రాణమును పణంగ పెట్టు మీ త్యాగమె ఆదర్శం   
                                                                  
                                                                    [సై]                   
భిన్నత్వం కలిగిన మన భారతదేశం లో 
ఏకత్వపు  సాధనకై  ఎప్పుడూ పోరాటం    
నిత్య జీవనం ..అదో యుద్ధ రంగం    
మీ తలపుల ఆగమనం
కలిగించును ఉపశమనం
పెద్ద సమస్యలు అన్నవి రెప్ప పాటులో మాయం  
                                                                    [ సై]

పాలకులు , శోధకులు, సాధకులు, సామాన్యులు 
ఎంత గొప్పవారైనా ఎదో తనదైన స్వార్థం  
గుండెను గుండుకు ఎరగా పెట్టే మీ స్థైర్యం లో     
దాగివున్నదంతా అంతులేని నిస్వార్థం 
అందుకే సలాం సలాం..                                     [సై]

శరత్
( Inspiration: A wallposter showing Soldiers feats near Brigade Road Junction, Bangalore )

Thursday, February 14, 2013

ప్రేమికుల రోజు



ప్రతి బంధములో ఉన్నదిలే ప్రేమ సంబంధము

ప్రేమికులకు ఎందుకు ఒక రోజు పరిమితము !! 

మిగతా రోజులు నాకేనా ?? అని ప్రశ్నిస్తోంది..

ఒక ప్రేమ రాహిత్య అనుభవము.....



శరత్

Saturday, February 2, 2013

TV సీరియళ్ళు

TV సీరియళ్ళు  
సగటు తెలుగు ఇళ్ళల్లో..వెగటు సమస్యల పురాణాలు...
చిన్న సమస్యను పెద్దగ చూపే అర్థం లేని పరాయణాలు.. 

"చిన్నకోడలు" చిందేసిందా ? 

గోపిక గెలిచిందా?

"అత్తారింట్లో అయిదు కోడళ్ళు"    
ఆరళ్ళు సహిస్తారా తెగిస్తారా ?

"కలవారి కొడళ్ళ" నడుమ   
కల్లబొల్లి కల్లోలాలు ? 

"అగ్నిపూలు" కురిసెను ..  
"మొగిలిరేకులు" విరిసేనో.. మరి ముగిసేనో.. ?

తొలిబంధాలు, మలి బంధాలు,భవ బంధాలు
అందరు కలసి అన్నం మరిచే "అనుబంధాలు" 

భరించలేని బుస్స్ బుస్స్ శభ్దాలు.. 
చెప్పుకు పొతే ఎన్నో..   

 TV సీరియళ్ళు

అసలు సమస్యని మార్చలేని మాయా మశ్చీంద్రాలు.. 
మానవత్వపు , మంచి కుటుంబపు వికాసానికి తీవ్ర అవరోధాలు


శరత్

Saturday, January 19, 2013

దూరం

కాలం వేసెను మంత్రం
చిన్నగ మారెను లోకం
దూరం అనుకోకు నేస్తం
దరిచేరే ఆనందం కోసం 
ధ్రుఢమైన సంకల్పం కోసం
సాగనీ నీ పయనం..

- శరత్

Monday, December 31, 2012

నవ వసంతం - 2013

నవీనా !!! 
నడువు నవదారుల్లో..
సుగంధ సుమాల సుదూరాలతో..  
ప్రశాంత వనాల దిగంతాలతో.. 
సుస్వర సంగీతపు ఝరితో.. !!! (2)

ఫ్రమోద ప్రభాతం 
ప్రపంచమంతా ప్రతిరోజూ  కనిపించేలా !!  

వినూత్న విశాల ధ్రుక్పథాలు    
విశ్వమంతా వ్యాపించేలా..!! 

ప్రళయ కాలాగ్ని జ్వాలలన్నీ  
ప్రేమ సాగరమున కలిసేలా !! 

వితండ వాదపు విషవలయాల్ని 
విశాల హ్రుదయం ఛేధించేలా..!!     

నవీనా !!!
నడువు నవదారుల్లో.. !!!

"నూతన సంవత్సర శుభాకాంక్షలు" 

- శరత్

Monday, September 17, 2012

"Life is beautiful"

ఆనందపు జీవితాన్ని
అందంగా చిత్రించి
కొత్తదనపు ఒరవడికి
మారుపేరు గా నిల్చి 
సున్నితపు భావాలను
సుందరంగ పేర్చి
సాదృస్యపు సొగసును
సమపాల్లలో అందించిన 
శేఖర్ కమ్ముల "Life is beautiful"     
movie looks beautiful

- శరత్

"చెలిమి"

ప్రకృతికి రాత్రి , పగలున్నట్లు
మనసుకి దిగులు ఆనందాలు
సూర్యుడంటి "చెలిమి" తోడుంటే   
దరి నిల్చునులే ఆనందపు కలిమి
-శరత్

Wednesday, August 29, 2012

తెలుగు దినోత్సవం

అనరా కమ్మని తెలుగు పదాలు
వినరా తీయ్యని తేనె పదాలు
సుందర సుమధుర జాన పదాలు
ప్రాచీనాంధ్రపు తెలుగు వెలుగులు
మనసారా అందరికి "తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు"

- శరత్ 

Sunday, July 15, 2012

ఈగ

ఈగ ఈగ ఈగ...
రాజమౌళి "ఈగ"
మంచి చిత్రాల సరళిలో వేసుకొంది పాగా.. 
తెలుగు సినీ ప్రపంచం గర్వించే లాగా.. 
సినిమా ఉన్నదిలే భలే అద్బుతంగా..
కనులవిందుగా !! సరదా సరదాగా !!

శరత్

Sunday, May 13, 2012

భెంగుళూరు

భెంగుళూరు .. భెంగలూరు
ట్రాఫిక్ ఝాముల హోరు         
నిరుద్యోగుల పోరు 
ఉద్యోగస్తుల జోరు..( అప్పుడప్పుడు బేజారు )   
నిత్యం వర్షపు నీరు..

-శరత్

ఆధునికత...ఆటవికత ...

ఆధునికత...ఆటవికత ...
ఏది ఈ లోకపు భవిత  !!!
పొటీలో ఈ జగమంతా 
నిత్యం ఉత్కంటత
మనుషుల్లోనే మృగాల చరిత 
ఆధిక్యతకై అలమటింత
                               ( ఆధునికతా..)
అత్యాధునికం మారణాయుధం
పాత కక్షల పాశవికత్వం
మానవ సంబంధాలను "money" తో
ముడిపెడుతున్న వైనం...
                              ( ఆధునికతా..)

శరత్ 

ప్రపంచ పౌరులు

ఈ ఊరు మనది కాదు
ఈ రాష్ట్రం మనది కాదు    
ఈ దేశం మనది కాదు 
ప్రపంచమే మనది
ప్రపంచ పౌరులం మనం
Software జనులారా
సత్యం కాదంటారా..
- శరత్

e-లోకం ( During my first Job )


e-లోకం లో ఎన్ని వింతలు !!!
e-లోకం లో కొత్త పుంతలు
కలుసుకోవాలంటే అది "outlook" లో 
స్వరములెన్నొ పలుకుతాయి "cubicles" లో 
                                                (e-లోకం )
గుర్తుకు వస్తాయి నాకు 
చలి చీమల దండులు
చూస్తుంటె ఇక్కడ "Team" లనే గుంపులు  
                                                 ( e-లోకం)
కష్టమేమి కాదు కొంత ఇష్టంగా మెలిగితే     
ప్రతిభ ఉంటె చూపించు "computers" లో 
వెలుగుతావు జాబిలిలా "company" లలో...
                                                ( e-లోకం )
- శరత్

రాయలసీమ

సీమ ప్రకృతి సిరులకు వెలితి
తరతరాలుగా మారెను దీని ఆక్రుతి
అలనాడు ఆ రాయల పాలన లో ప్రగతి
రత్నాలే రాసులుగా పోసినట్టి పరిస్థితి    
కక్షలు కార్పణ్యాలు , కరగని మేఘాలు
కారణాలు కాగా ఎడారిగా మారుతోంది    
నేడు దీని దుస్థితి 

శరత్

Friday, March 23, 2012

ఉగాది ..

తెలుగు వసంతం వచ్హింది ఆనంద"నందనం" గా..
ఉగాది వసంతం స్వాగతిస్తోంది అభినందన వందనం తో

- శరత్

Monday, February 27, 2012

చిన్నిపాప ప్రశ్న

అమాయకంగా చిన్నిపాప అడుగుతుంది ప్రశ్న
త్రుష్ణ తోటి పరిగెడుతూ.. ప్రశ్న మీద ప్రశ్న

ఆడే పాడే ఆటల నడుమ అల్లుకునే ప్రశ్న
ముద్దు ముద్దు మాటల నడుమ ముచ్హటైన ప్రశ్న

అటు ఇటు వెల్లొద్దంటేను భయం లెని ప్రశ్న
అవి ఇవి చెయ్యొద్దంటేను ఆకతాయి ప్రశ్న
కథను చెబుదామంటేను పదము పదము కో ప్రశ్న..
క్షణమొక ప్రశ్న,
మరియొక ప్రశ్న,
జవాబు చెప్పు ఓ క్రిష్ణ...

అమాయకంగా చిన్నిపాప అడుగుతుంది ప్రశ్న
త్రుష్ణ తోటి పరిగెడుతూ.. ప్రశ్న మీద ప్రశ్న ..

- Sarath

Saturday, January 14, 2012

సంక్రాంతి

చలి చీకట్లో భోగి మంటల కాంతి
ముంగిట్లో రంగుల ముగ్గుల కాంతి
పాడి పంటలతో పల్లె సీమల కాంతి
ఇంటింటా విరిసే నవ్వుల కాంతి
కొత్త వెన్నెలే "సంక్రాంతి"...

- శరత్

Friday, December 23, 2011

మనీ ( డబ్బు )

'మనీ' ఓ 'మనీ'
ఏమని వర్ణించను నీ మహిమని..
మహి లో ప్రతి మనిషికి నీవే ఇంధనమని..

చెప్పగలవు నీవు ఓ 'మనీ' !!
చేరువున్న వాళ్ళను చెదరిపొమ్మని..
దూరమనే వాళ్ళను దరికి రమ్మని..

సృస్టించగలవు నీవు ఓ 'మనీ' !!
స్వార్థమనె ఆయువును..
కపటమనే కల్పనని.
పొగరు అనే పౌరుషాన్ని.

పెంచేయగలవు నీవు ఓ 'మనీ' !!
ప్రమోదాన్ని ప్రమాదాన్ని

మరపింప గలవు నీవు మానవుని..
ప్రతీ మనిషి లాగా తాను ఒక మనిషినన్న నిజాన్ని..

- శరత్

Saturday, December 17, 2011

ఓర్పు ..

అమావాస్యలో కనిపించేనా ఆ నిండు జాబిల్లి
వచ్హు పుణ్ణమికి వేచి చూడాలి కాలం తో కదలి..

- శరత్

నా పెళ్ళి పత్రిక ..

హృదయాన్ని తాకె మధురానుభూతి
నా నెచ్హెలి జాడే తెలియగా ...
గగనాన్ని తాకె ఆనంద కాంతి
మా ఇంట సందడే మొదలవగా ...
వేద వాద్యాల స్వరద్వయం
శుభమంగళం పలుకగా
< date & time >
నా నవ జీవనపు సుజిత యై "సుజిత" గా
తను అడుగిడగా..
ఆశీర్వదింప రారండి నా ఆహ్వానం మన్నింపగా.. !

ఆతిథ్యం స్వీకరించండి
ఆహ్లాదాన్ని పంచగా
మరువక రా రండి !!!
మా కళ్యాణ వేడుక
తీపి గుర్తుగా .. మిగులగా ... !!!

-శరత్

Tuesday, December 13, 2011

ఊటీ ...

"పచ్హదనం" కనుచూపుమేరలో....
"చల్లదనం" చలి గిలిగింతలలో..
వర్షపు ఝల్లుల లాహిరిలో..
"వెచ్హదనం" ఛాయాచిత్రపు పలకరింపులో...
ఊటి అందాల వెలుగులలో...
- శరత్

Thursday, December 8, 2011

చందమామ పిలుపు కొత్తగా...

చాన్నాళ్ళయింది చూసి
ఓ చందమామ !!
చిన్ని పాప ఏడుపాప
చిటికె లోన రావె...
చాన్నాళ్ళయింది చూసి !

కరుగుతావు పెరుగుతావు...
ఓ ఆకాశపు మంచు బొమ్మ..
వేచి వుంది బోసి నవ్వు ..వేగంగా రావే
చాన్నాళ్ళయింది చూసి

చానళ్ళ(TV channels) మోజులో
చాంతాడు పనులతో..
రొజూ నిను చూడలేము..
అలుగకు మా....
ఓ మేఘాల ముద్దుగుమ్మ !!!
చాన్నాళ్ళయింది చూసి
చిన్ని పాప ఏడుపాప
చిటికె లోన రావె...
- శరత్