Monday, December 31, 2012

నవ వసంతం - 2013

నవీనా !!! 
నడువు నవదారుల్లో..
సుగంధ సుమాల సుదూరాలతో..  
ప్రశాంత వనాల దిగంతాలతో.. 
సుస్వర సంగీతపు ఝరితో.. !!! (2)

ఫ్రమోద ప్రభాతం 
ప్రపంచమంతా ప్రతిరోజూ  కనిపించేలా !!  

వినూత్న విశాల ధ్రుక్పథాలు    
విశ్వమంతా వ్యాపించేలా..!! 

ప్రళయ కాలాగ్ని జ్వాలలన్నీ  
ప్రేమ సాగరమున కలిసేలా !! 

వితండ వాదపు విషవలయాల్ని 
విశాల హ్రుదయం ఛేధించేలా..!!     

నవీనా !!!
నడువు నవదారుల్లో.. !!!

"నూతన సంవత్సర శుభాకాంక్షలు" 

- శరత్

Monday, September 17, 2012

"Life is beautiful"

ఆనందపు జీవితాన్ని
అందంగా చిత్రించి
కొత్తదనపు ఒరవడికి
మారుపేరు గా నిల్చి 
సున్నితపు భావాలను
సుందరంగ పేర్చి
సాదృస్యపు సొగసును
సమపాల్లలో అందించిన 
శేఖర్ కమ్ముల "Life is beautiful"     
movie looks beautiful

- శరత్

"చెలిమి"

ప్రకృతికి రాత్రి , పగలున్నట్లు
మనసుకి దిగులు ఆనందాలు
సూర్యుడంటి "చెలిమి" తోడుంటే   
దరి నిల్చునులే ఆనందపు కలిమి
-శరత్

Wednesday, August 29, 2012

తెలుగు దినోత్సవం

అనరా కమ్మని తెలుగు పదాలు
వినరా తీయ్యని తేనె పదాలు
సుందర సుమధుర జాన పదాలు
ప్రాచీనాంధ్రపు తెలుగు వెలుగులు
మనసారా అందరికి "తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు"

- శరత్ 

Sunday, July 15, 2012

ఈగ

ఈగ ఈగ ఈగ...
రాజమౌళి "ఈగ"
మంచి చిత్రాల సరళిలో వేసుకొంది పాగా.. 
తెలుగు సినీ ప్రపంచం గర్వించే లాగా.. 
సినిమా ఉన్నదిలే భలే అద్బుతంగా..
కనులవిందుగా !! సరదా సరదాగా !!

శరత్

Sunday, May 13, 2012

భెంగుళూరు

భెంగుళూరు .. భెంగలూరు
ట్రాఫిక్ ఝాముల హోరు         
నిరుద్యోగుల పోరు 
ఉద్యోగస్తుల జోరు..( అప్పుడప్పుడు బేజారు )   
నిత్యం వర్షపు నీరు..

-శరత్

ఆధునికత...ఆటవికత ...

ఆధునికత...ఆటవికత ...
ఏది ఈ లోకపు భవిత  !!!
పొటీలో ఈ జగమంతా 
నిత్యం ఉత్కంటత
మనుషుల్లోనే మృగాల చరిత 
ఆధిక్యతకై అలమటింత
                               ( ఆధునికతా..)
అత్యాధునికం మారణాయుధం
పాత కక్షల పాశవికత్వం
మానవ సంబంధాలను "money" తో
ముడిపెడుతున్న వైనం...
                              ( ఆధునికతా..)

శరత్ 

ప్రపంచ పౌరులు

ఈ ఊరు మనది కాదు
ఈ రాష్ట్రం మనది కాదు    
ఈ దేశం మనది కాదు 
ప్రపంచమే మనది
ప్రపంచ పౌరులం మనం
Software జనులారా
సత్యం కాదంటారా..
- శరత్

e-లోకం ( During my first Job )


e-లోకం లో ఎన్ని వింతలు !!!
e-లోకం లో కొత్త పుంతలు
కలుసుకోవాలంటే అది "outlook" లో 
స్వరములెన్నొ పలుకుతాయి "cubicles" లో 
                                                (e-లోకం )
గుర్తుకు వస్తాయి నాకు 
చలి చీమల దండులు
చూస్తుంటె ఇక్కడ "Team" లనే గుంపులు  
                                                 ( e-లోకం)
కష్టమేమి కాదు కొంత ఇష్టంగా మెలిగితే     
ప్రతిభ ఉంటె చూపించు "computers" లో 
వెలుగుతావు జాబిలిలా "company" లలో...
                                                ( e-లోకం )
- శరత్

రాయలసీమ

సీమ ప్రకృతి సిరులకు వెలితి
తరతరాలుగా మారెను దీని ఆక్రుతి
అలనాడు ఆ రాయల పాలన లో ప్రగతి
రత్నాలే రాసులుగా పోసినట్టి పరిస్థితి    
కక్షలు కార్పణ్యాలు , కరగని మేఘాలు
కారణాలు కాగా ఎడారిగా మారుతోంది    
నేడు దీని దుస్థితి 

శరత్

Friday, March 23, 2012

ఉగాది ..

తెలుగు వసంతం వచ్హింది ఆనంద"నందనం" గా..
ఉగాది వసంతం స్వాగతిస్తోంది అభినందన వందనం తో

- శరత్

Monday, February 27, 2012

చిన్నిపాప ప్రశ్న

అమాయకంగా చిన్నిపాప అడుగుతుంది ప్రశ్న
త్రుష్ణ తోటి పరిగెడుతూ.. ప్రశ్న మీద ప్రశ్న

ఆడే పాడే ఆటల నడుమ అల్లుకునే ప్రశ్న
ముద్దు ముద్దు మాటల నడుమ ముచ్హటైన ప్రశ్న

అటు ఇటు వెల్లొద్దంటేను భయం లెని ప్రశ్న
అవి ఇవి చెయ్యొద్దంటేను ఆకతాయి ప్రశ్న
కథను చెబుదామంటేను పదము పదము కో ప్రశ్న..
క్షణమొక ప్రశ్న,
మరియొక ప్రశ్న,
జవాబు చెప్పు ఓ క్రిష్ణ...

అమాయకంగా చిన్నిపాప అడుగుతుంది ప్రశ్న
త్రుష్ణ తోటి పరిగెడుతూ.. ప్రశ్న మీద ప్రశ్న ..

- Sarath

Saturday, January 14, 2012

సంక్రాంతి

చలి చీకట్లో భోగి మంటల కాంతి
ముంగిట్లో రంగుల ముగ్గుల కాంతి
పాడి పంటలతో పల్లె సీమల కాంతి
ఇంటింటా విరిసే నవ్వుల కాంతి
కొత్త వెన్నెలే "సంక్రాంతి"...

- శరత్