Saturday, December 31, 2022

  Happy New Year 2023

కొత్తగా కోట్ల ఆశల వెలుగు స్వాగతం పలుకుతోంది
కాలపు కొత్త మజిలీకి....
కొత్త సంవత్సారానికి!!.

తరిగిపోవాలని
సమరనాదాలు, మహమ్మారి మాయలు !!
నిరాశలు,  నిట్టూర్పులు !!
మనుషుల్లో పైశాచికాలు  !!

పెరుగుతూ ఉండాలని
సామరస్యాలు,
ఓర్పులు, నేర్పులు  !!
బంధాల్లో బలాలు
పసిపాపల ఆట పాటలు
విశ్వ శాంతి మంత్రాలు !!

కొత్తగా కోట్ల ఆశల వెలుగు స్వాగతం పలుకుతోంది
కాలపు కొత్త మజిలీకి..
కొత్త సంవత్సారానికి !!

 -శరత్



 

Thursday, November 17, 2022

చలోదయం

కునుకు వదలనంటోంది
వణుకు కదలనంటోంది
మంచు తో జత కట్టి
చలిగాలి నవ్వుతోంది :)
- శరత్

Monday, October 24, 2022

Happy Diwali ..( దీపావళి శుభాకాంక్షలు)


కరిగిపొవాలి చీకట్లు , ఇక్కట్లు !!
దరికి చేరాలి  విజయాలు..!!
చిరుదివ్వెలు వెలిగించునులే వెన్నెలలు ..
చిరునవ్వులు సాధించునులే విజయాలు
దీపావళి తో జరుపుకుందాము సందళ్లు
స్వాగతిద్దాము ముంగిళికి విజయాలు
దీపావళి శుభాకాంక్షలు !!
-శరత్

Saturday, July 23, 2022

Ugaadi 2022

 కొత్త చిగురు అందం

కొత్త ఆశల ఆనందం

షడ్రుచుల సాంప్రదాయం

నవ వసంత సందర్భం 

ఉగాదికి స్వాగతం !!


కట్టుబాట్లకు తిలోదకం 

ఉక్రైన్ యుద్దం    

గర్జించిన RRR చిత్రం

ఇది నేటి ప్రపంచం 


శుభాలెన్నో కలగాలని ఆశిద్దాం

స్వాగతం "శుభకృతి" నామ సంవత్సరం


ఉగాది శుభాకాంక్షలు 


- శరత్

Sunday, February 27, 2022

Happy New Year 2022...

 Happy New Year 2022...

కొత్త సంవత్సరం
కొత్త ఆశలతో స్వాగతం
భయం వీడి జయం వైపు అడుగిడాలని
పెరుగుతున్న డోసులు తరిగిపోవాలని
నలుగుతున్న బ్రతుకులు బాగు కావాలని

అసహనాల తీవ్రం అంతరించి..
క్షణ వీక్షణాలలో గురి పెరగాలని !!

కుగ్రామే ప్రపంచం నేడు...
దుష్ప్రచార దావానలం ఆగాలని
మనుషులు కలిసే దోషం  తొలగిపోవాలని

పసిపాపల నవ్వులు...
ప్రకృతి శాంతి మంత్రాలు ప్రజ్వరిల్లాలని



స్వాగతం ఓ 2022


శరత్