Sunday, December 31, 2023

Happy New Year 2024

 పదండి పయనిద్దాం
కొత్త సంవత్సరంలోకి !!

మంచి జ్ఞాపకాల మూట కట్టుకొని
కొత్త ఆశల కోట కట్టుకొని

పదండి పయనిద్దాం
కొత్త సంవత్సరంలోకి !!

కలలు నిజమవ్వాలని
ఓర్పు గెలుపవ్వాలని
క్రుత్రిమ మేధ( AI ) తో సామరస్యాలు,
బంధాల్లో బలాలు, 
పసిపాపల కేరింతలు,
ప్రకృతి శాంతి మంత్రాలు ప్రజ్వరిల్లాలని


పదండి పయనిద్దాం
కొత్త సంవత్సరంలోకి !!

మంచి 
జ్ఞాపకాల మూట కట్టుకొని
 కొత్త ఆశల కోట కట్టుకొని

పదండి పయనిద్దాం
కొత్త సంవత్సరంలోకి !!


స్వాగతం పలుకుదాం
కొత్త సంవత్సరానికి !!


-శరత్

Sunday, November 19, 2023

దీపావళి (Diwali )

 

చిమ్మచీకటి కమ్ముకొచ్హేవేళ 
దారి చూపేది చిరుదివ్వె !!
కష్టాలన్ని చుట్టుముట్టేవేళ
ఆశ నింపేది చిరునవ్వు !!
చిరుదివ్వెలు , చిరునవ్వులతో
వెలుగు పంచేది దీపావళి !!

దీపావళి పండుగ  శుభాకాంక్షలు!!

- శరత్

Monday, September 18, 2023

జయ జయ జయ వినాయక

 

విఘ్నాలను తొలగించే దేవా
విన్నపాలు మన్నించే దేవా
స్వీకరించవా మా సేవ !!
సకల శుభాలను తీసుకు రావా !!

వినాయక చవితి శుభాకాంక్షలు !!

-శరత్

Tuesday, September 5, 2023

Teachers day

చిన్నారి పాపలు
చిట్టి చేతులు...
బుడి బుడి నడకలు
ముద్దు మాటలు...
వడి వడి అడుగులతో
పరిగెడుతూ వచ్చి
ఎగబడుతూ కలబడుతూ
"Happy Teachers Day" అంటుంటే
ఆనందతాండవమె చేయును మనసు
పునరంకితమే బదులు అని తెలుసు ...

- శరత్

Tuesday, August 29, 2023

రాఖి

రాఖి బంధం
అన్న చెల్లెళ్ళ, అక్క తమ్ముళ్ళ
అనిర్వచనీయతకు చిరు తార్కాణం

జీవితకాలం విడిపోలేనిది
కల్మషమన్నది యెరుగనిది
రక్షణగా నిలిచేది
అద్బుతమైనది ఈ అనుబంధం

తరాలు మారినా మారనిది
అంతరాలలో వెలిగేది
సాంప్రదాయల పెన్నిధి
ఈ రాఖి పర్వదినం

- శరత్

Monday, August 14, 2023

farewell

 రోజా పువ్వుల స్వాగతాలతో
ప్రారంభించిన వైనం
కనుల ముందుంది ఇంకా
కళకళలాడిన ఆ తరుణం

ఎంత వెగమీ కాలం.. ఎంత వెగమీ కాలం
ఈనాడిప్పుదు ఇక్కడ జరుగుతోంది  వీడ్కోలు సంబరం

నాలో కలిగిన కలవరం
అది అందుకోలేదు నా స్వరం

మొదలు కానుంది పౌరుని పర్వం
చూడాలిప్పుడు మరో జగం
కావాలందరి జీవితం ఒక్కొక్కరిది ఒక మధుర కావ్యం..

- శరత్

కళాకారుడు

 

కళాకారుడు అతడే కళాకారుడు
కళ తెలిసిన వాడు...కళ తెచ్హే వాడు
గళాన్నే పెంచి
దళాన్నే సృష్టించి ..
విప్లవాన్ని తీసుకొచ్హు
శక్తి సంపన్నుడు
కళాకారుడు అతడే కళాకారుడు

-శరత్
 
 

Saturday, April 29, 2023

శుభోదయం ..

 

నిద్ర లేచింది నయనం...
విరగబూసింది కుసుమం..
కిలకిల మని పక్షుల రావం...
బిలబిల మని జన జీవనం..
కళకళగా ప్రక్రుతి అందం..
అహా!!..ఆహ్లాదభరితం !
తూర్పు వైపు వెలుగు రేఖ
నింపునులే.. మనోబలం... !!
- శరత్


Tuesday, March 21, 2023

ఉగాది ( Ugaadi 2023 )

కళకళలను తీసుకొచ్హి
శుభాలనే మోసుకొచ్హి
షడ్రుచులను మేళవించి
నవవసంత శోభను సంతరించి ....
"శోభకృతి" నామముతో వచ్హెనులే ఉగాది
తెలుగు, కన్నడ సంవత్సరాదిని స్వాగతించెనులే ఉగాది !!


ఉగాది శుభాకాంక్షలు

- శరత్

Monday, March 13, 2023

Naatu Naatu song Oscar

 "నాటు నాటు" పాట రాటుదేలి పోయింది
రాజమౌళి బృందం ఘాటు ముద్ర వేసింది
తెలుగు చలన చిత్రం రూటు మార్చుకుంది
"అంతర్జాతీయం" అనే అందలమెక్కింది
"ఆస్కారు" గెలుచుకొని అద్భుతమే చేసింది
అమితానందాన్ని సొంతం చేసింది

- శరత్

Sunday, February 19, 2023

శుభోదయం

 ఉదయకిరణాల పలకరింపులు
ప్రకృతి లోని పులకరింపులు
పసిపాపల కేరింతలు
స్వచ్హమైన చిరునవ్వులు
పాతమిత్రుల విచారింపులు
ఇష్టమైన అభిరుచులు( passion )
"వెల" లేనివి "వల" లేనివి
విలువైనవి

- శరత్

Saturday, December 31, 2022

  Happy New Year 2023

కొత్తగా కోట్ల ఆశల వెలుగు స్వాగతం పలుకుతోంది
కాలపు కొత్త మజిలీకి....
కొత్త సంవత్సారానికి!!.

తరిగిపోవాలని
సమరనాదాలు, మహమ్మారి మాయలు !!
నిరాశలు,  నిట్టూర్పులు !!
మనుషుల్లో పైశాచికాలు  !!

పెరుగుతూ ఉండాలని
సామరస్యాలు,
ఓర్పులు, నేర్పులు  !!
బంధాల్లో బలాలు
పసిపాపల ఆట పాటలు
విశ్వ శాంతి మంత్రాలు !!

కొత్తగా కోట్ల ఆశల వెలుగు స్వాగతం పలుకుతోంది
కాలపు కొత్త మజిలీకి..
కొత్త సంవత్సారానికి !!

 -శరత్



 

Thursday, November 17, 2022

చలోదయం

కునుకు వదలనంటోంది
వణుకు కదలనంటోంది
మంచు తో జత కట్టి
చలిగాలి నవ్వుతోంది :)
- శరత్

Monday, October 24, 2022

Happy Diwali ..( దీపావళి శుభాకాంక్షలు)


కరిగిపొవాలి చీకట్లు , ఇక్కట్లు !!
దరికి చేరాలి  విజయాలు..!!
చిరుదివ్వెలు వెలిగించునులే వెన్నెలలు ..
చిరునవ్వులు సాధించునులే విజయాలు
దీపావళి తో జరుపుకుందాము సందళ్లు
స్వాగతిద్దాము ముంగిళికి విజయాలు
దీపావళి శుభాకాంక్షలు !!
-శరత్

Saturday, July 23, 2022

Ugaadi 2022

 కొత్త చిగురు అందం

కొత్త ఆశల ఆనందం

షడ్రుచుల సాంప్రదాయం

నవ వసంత సందర్భం 

ఉగాదికి స్వాగతం !!


కట్టుబాట్లకు తిలోదకం 

ఉక్రైన్ యుద్దం    

గర్జించిన RRR చిత్రం

ఇది నేటి ప్రపంచం 


శుభాలెన్నో కలగాలని ఆశిద్దాం

స్వాగతం "శుభకృతి" నామ సంవత్సరం


ఉగాది శుభాకాంక్షలు 


- శరత్

Sunday, February 27, 2022

Happy New Year 2022...

 Happy New Year 2022...

కొత్త సంవత్సరం
కొత్త ఆశలతో స్వాగతం
భయం వీడి జయం వైపు అడుగిడాలని
పెరుగుతున్న డోసులు తరిగిపోవాలని
నలుగుతున్న బ్రతుకులు బాగు కావాలని

అసహనాల తీవ్రం అంతరించి..
క్షణ వీక్షణాలలో గురి పెరగాలని !!

కుగ్రామే ప్రపంచం నేడు...
దుష్ప్రచార దావానలం ఆగాలని
మనుషులు కలిసే దోషం  తొలగిపోవాలని

పసిపాపల నవ్వులు...
ప్రకృతి శాంతి మంత్రాలు ప్రజ్వరిల్లాలని



స్వాగతం ఓ 2022


శరత్

Friday, December 3, 2021

సిరివెన్నెల

 ఒకటా!... రెండా!!  చెప్పడానికి ..
వందలు!.. వేలే.!!.. పొగడడానికి..  
సిరివెన్నెల వెలిగించిన పాటలు
జగానికే వెలుగిచ్హిన పాటలు
కదిలించి.. రగిలించిన పాటలు
మురిపించి.. మరిపించిన పాటలు
"విధాత తలపుల" నుండి "సామజవరగమన" వరకు
ఒక్కో పాట భావ గ్రంధమే..
తెలుగు వెలుగును పెంచే ఆణిముత్యమే !!

పాటల రైతు అలసిపొయాడు
కలం వీరుడు కనుమరుగయ్యాడు
భావ శూన్యపు చీకటికి వెలుగునిచ్హేందుకేమో ..
నింగికెగసి సూర్యుడయ్యాడు

- శరత్

Tuesday, November 16, 2021

Happy Ugadi 2021

 

ఆప్తులను కలవాలా.. వద్దా..
ప్రయాణం చెయ్యాలా.. వద్దా..
మాస్క్ వెయ్యాలా వద్దా..
మందులు సరి అయినవా కావా..
అసలు వ్యవస్థ ను నమ్మాలా వద్దా..
నిర్ధిష్టమైన వైరుధ్యాలు ..అగమ్యగోచరాలు
ఊగిసలాటల నడుమ
వచ్హెను లే ఉగాది..
ప్లవ నామపు ఉగాది..
నమ్మకాన్ని నిర్మించి..మనుషులంత కలిసుండె
నవ జీవన విప్లవాన్ని తీసుకురా ఉగాది..
ఉగాది శుభాకాంక్షలు
శరత్

Happy New Year 2021 !!

 


ఊహించని ఉదృతాలు
ఆశ్చర్యకర పరిణామాలు
మనుషుల్లో వైవిధ్యాలు
బంధాల్లొ వైరుధ్యాలు
కనిపించని కస్టాలెన్నో
కనిపించేలా..
కొందరికి కంగారులా
కొందరికి బేజారులా
కొందరికి అవకాశంలా
కొత్త పాఠాలు నెర్చుకునేలా
శతాబ్దానికే ముఖ్యాంశంలా
ఏందరికో మరువాలనుకునే చేదు ఙ్నాపకం లా..
కదలి పో ఓ 2020
స్వాగతం ఓ 2021
పోరాడే శ్వాసలకు ఆశ గొప్పతనం తెలిసేలా
నిస్సత్తువ జీవితాల్లో నిర్మలత్వం నిండేలా..
ప్రకృతి శాంతి మంత్రం ప్రజ్వరిల్లెలా..
కదలి రా ఓ 2021 !!
- శరత్

SPB

 

బాలు
 
ఆ పేరు వింటే చాలు 
మ్రోగుతాయి మదిలో రాగాల తరంగాలు
మెదలుతాయి ఆత్మ బంధువులై పాట వెనుక కథలు 
ఆ గొంతు పలికే .. కదిలించే భావాలు 
అగాధం లో దాగిన ఆణిముత్యం దొరికినట్టు,
విశాలం దరి చేరినట్టు,
దేవుడిని దర్శించినట్టు 
నిత్యం మన మధ్యన ఉండే గాన గంధర్వాలు 
ఆ పాటలు...
పాటల ప్రియులకు,
కళా హ్రుదయులకు
నిత్య స్మరణాలు 
అజరామరణాలు... 

శరత్

Friday, January 17, 2020

Happy Sankranthi (సంక్రాంతి శుభాకాంక్షలు)

సంక్రాంతి "అల" వచ్హెను ఇలా
"సరిలేరు నీకెవ్వరు" అనే సంబరం లా
సరిక్రొత్త "దర్బారు" లా !!
చలిగాలుల వల
రైతన్నల రంగుల కల
ముంగిళ్ళలో
రంగవల్లుల కళ
పిన్నపెద్దల నవ్వుల కళ కళ ..
ఈ భోగి, సంక్రాంతి ,కనుమల మేళా !!
సంక్రాంతి శుభాకాంక్షలు
శరత్

Wednesday, January 1, 2020

Happy New Year 2020

Happy New Year 2020

20-20 ఆడుతున్నట్లుంది కాలం
అప్పుడే వచ్హెను 2020 సంవత్సరం..
స్వాగతం సుస్వాగతం
ఓ నవ వసంతమా..  స్వాగతం !! 


కాలపు కదలిక లో కనిపించును
ఎన్నో వెలుగు నీడల మజిలీలు ! 
కావాలి ఆశల నమూనాలు
స్వీకరించేందుకు అసౌకర్యపు నిజాలు !! 

ఓ నవ వసంతమా..
నిరాశ నిస్పృ హ లను పారద్రోలె  
బలాన్ని ఇవ్వు...
మానవత్వపు పరిమళాల్ని   
నిరాకంటంగ వెదజల్లనివ్వు.. !!

ఓ నవ వసంతమా..
పసి పాపల బోసి నవ్వుల్ని.
లోక కళ్యాణపు కాంతుల్ని  
నిర్విరామముగ వెలగనివ్వు .. !!
స్వాగతం సుస్వాగతం !!

Happy New Year 2020
 
శరత్ 

Wednesday, September 25, 2019

పుట్టిన రోజు( Birthday)


పుట్టిన రోజు
మాకు పండుగ రోజు
మా ఇంట అడుగు పెట్టిన రోజు 

బోసి నవ్వులు, కేరింతలకు
పదహారెళ్ళు..నిండిన రోజు
మా మదిలో ఆనందం
సరికొత్త పరవళ్ళు..తొక్కిన రోజు
మా ముద్దుల చిన్నారి అనన్య పుట్టిన రొజు 

ఆరోగ్యం, ఐశ్వర్యం 
నీ చిరుదరహాసపు స్నేహితులై 
కలకాలం కలిసుండాలని...
నీ లక్షాలను 
సులక్షనంగా జయించాలని...
పిన్న పెద్దల అభినందనలు.. ఆశీర్వాదాలు.. 
వెల్లి విరిసే రోజు !
మా ఇంట వేడుక జరిగే రోజు !!   


శరత్


Wednesday, April 10, 2019

Happy Ugaadi 2019

Happy Ugaadi
కలలు కలలు..
మంచి జరగాలని కలలు!
కళలు కళలు..
ఆధికారం కోసం నాయకుల కళలు!
ఎన్నికలతో వచ్హెను ఉగాది పండుగ కళకళలు !!
మిన్నకుండక ఓటు వేసి ..
మన్నికైన నాయకున్ని ..
ఎన్నుకోవాలని..విన్నపాలు !!
వికారి నామ సంవత్సర
శుభాకాంక్షలు..
- శరత్

Tuesday, April 17, 2018

Asifaa ..

కన్నీరు ఆగలేదు ..
కళ్ళముందు కనిపించే 
చిన్నారి చిత్రాన్ని చూసి...
చిన్నారికి జరిగిన ఘోరాన్ని చూసి !!! 

లేత గుండె ఎంతగా విక్రుతాన్ని చూసెనో...  
మానవ మనుగడే వ్యర్థమైనంతగా 
సాధించిన ప్రగతి శూన్యమైనంతగా   !!

ఓడినాం ఓడినాం  
అగాధాన...అట్టడుగున   
పడిపొయిన ఆటవికులమైనాం 
ఈ కాలం తో ఇలా పయనిస్త్తున్నాం

గెలుపెంతో సాధించామని విర్ర వీగు హ్రుదయాలకు  
మానవత్వ సమాధి పై మ్రగ్గుతున్నామని తెలుసునా..

తల తెగ నరకాలని వచ్హే ఆవేశం చల్ల బడదు నిజమే !! 
ఇలాంటి ఘటనలు ... అసలు ఆగక పొవడము నిజమే !!

ఆలోచించండి..  !!

మనిషి చావడం కన్నా ముందే వ్యవస్త చావాలి 
మృగాలుగా మార్చే అఙ్గానం పోవాలి         

ఆడమనిషి మనిషని...
వస్తువు కానే కాదని చూసే  
సంస్కృతి రావాలి...    

శరత్

Sunday, March 18, 2018

Happy ugaadi 2018

ఉగాది మన కోసం
తెచ్హెను ఆనందం !!
పిన్న పెద్దలలో పండుగ ఆనందం..
కొత్త చిగురు అందం..
ప్రకృతి మార్పులతో పరమానందం..

ఉగాది మన కోసం
తెచ్హెను ఆరంభం !!
విళంబి నామ సంవత్సర స్వాగతారంభం

శుభాలెన్నో కలుగునని ఆశిద్దాం..

ఉగాది శుభాకాంక్షలు

శరత్

Friday, October 20, 2017

Deepaavali( Happy Diwali)

Happy Diwali

వెన్నెల వచ్హింది
నింగి నుండి నేలకు..
దివ్వెల వెలుగై !!

సంబరం హెచ్హింది
బాణాసంచాలతో
ఆనందపు తరంగమై !!

కళ కళ తెచ్హింది
దీపావళి మనకు ..
కలలు సాకారమై !!

శరత్

Tuesday, November 29, 2016

నమ్మకం ( Belief )

నేను ప్రవాహాన్ని ...
నీ ఆశల నదినై కదిలే ఒక ప్రవాహాన్ని !!
నేను సమూహాన్ని....
నీ ఆశయ సాధనలో అలుపెరుగని సైన్యాన్ని !!
నేను సమీరాన్ని....
నీ ఆనందపు జడి లో హాయిగొల్పు సమీరాన్ని!!
నేను విశాలాన్ని ...
నీ అలోచనల పరంపరను శాసించే విశాలాన్ని   !!

నేను నీ నమ్మకాన్ని... !!  
- శరత్

Sunday, October 30, 2016

Happy Diwali

Happy Diwali to All...
చిరుదివ్వెల చిరుకాంతులతో
మెరిసెనులే ముంగిళ్ళు !!
చిరునవ్వులు, చిరుచిందులతో
మురిసెనులే లోగిల్లు !!
ఆనందపు అల్లరి తో
దశదిశలా దీపావళి సందళ్ళు..!!
ఆందరికి దీపావళి శుభాకాంక్షలు..

- శరత్

Saturday, April 9, 2016

Happy ugadi

Happy Ugadi

మామిళ్ళ సందడి,
వసంతపు గారడి,
తెలుగు, కన్నడ, మరాఠి 
నూతన సంవత్సరాది
నవ్యోత్సాహము..
నవశోభతో ఉగాది   !! 
ఉగాది శుభాకాంక్షలు ..
శరత్