Friday, December 23, 2011

మనీ ( డబ్బు )

'మనీ' ఓ 'మనీ'
ఏమని వర్ణించను నీ మహిమని..
మహి లో ప్రతి మనిషికి నీవే ఇంధనమని..

చెప్పగలవు నీవు ఓ 'మనీ' !!
చేరువున్న వాళ్ళను చెదరిపొమ్మని..
దూరమనే వాళ్ళను దరికి రమ్మని..

సృస్టించగలవు నీవు ఓ 'మనీ' !!
స్వార్థమనె ఆయువును..
కపటమనే కల్పనని.
పొగరు అనే పౌరుషాన్ని.

పెంచేయగలవు నీవు ఓ 'మనీ' !!
ప్రమోదాన్ని ప్రమాదాన్ని

మరపింప గలవు నీవు మానవుని..
ప్రతీ మనిషి లాగా తాను ఒక మనిషినన్న నిజాన్ని..

- శరత్

Saturday, December 17, 2011

ఓర్పు ..

అమావాస్యలో కనిపించేనా ఆ నిండు జాబిల్లి
వచ్హు పుణ్ణమికి వేచి చూడాలి కాలం తో కదలి..

- శరత్

నా పెళ్ళి పత్రిక ..

హృదయాన్ని తాకె మధురానుభూతి
నా నెచ్హెలి జాడే తెలియగా ...
గగనాన్ని తాకె ఆనంద కాంతి
మా ఇంట సందడే మొదలవగా ...
వేద వాద్యాల స్వరద్వయం
శుభమంగళం పలుకగా
< date & time >
నా నవ జీవనపు సుజిత యై "సుజిత" గా
తను అడుగిడగా..
ఆశీర్వదింప రారండి నా ఆహ్వానం మన్నింపగా.. !

ఆతిథ్యం స్వీకరించండి
ఆహ్లాదాన్ని పంచగా
మరువక రా రండి !!!
మా కళ్యాణ వేడుక
తీపి గుర్తుగా .. మిగులగా ... !!!

-శరత్

Tuesday, December 13, 2011

ఊటీ ...

"పచ్హదనం" కనుచూపుమేరలో....
"చల్లదనం" చలి గిలిగింతలలో..
వర్షపు ఝల్లుల లాహిరిలో..
"వెచ్హదనం" ఛాయాచిత్రపు పలకరింపులో...
ఊటి అందాల వెలుగులలో...
- శరత్

Thursday, December 8, 2011

చందమామ పిలుపు కొత్తగా...

చాన్నాళ్ళయింది చూసి
ఓ చందమామ !!
చిన్ని పాప ఏడుపాప
చిటికె లోన రావె...
చాన్నాళ్ళయింది చూసి !

కరుగుతావు పెరుగుతావు...
ఓ ఆకాశపు మంచు బొమ్మ..
వేచి వుంది బోసి నవ్వు ..వేగంగా రావే
చాన్నాళ్ళయింది చూసి

చానళ్ళ(TV channels) మోజులో
చాంతాడు పనులతో..
రొజూ నిను చూడలేము..
అలుగకు మా....
ఓ మేఘాల ముద్దుగుమ్మ !!!
చాన్నాళ్ళయింది చూసి
చిన్ని పాప ఏడుపాప
చిటికె లోన రావె...
- శరత్

ట్రాఫిక్ సిగ్నల్.

ఎర్రచంద్రుడు ఆగమన్నాడు
ఆకుపచ్హ బాణమేసి కదల మన్నాడు
కదిలావంటె ముందుగా కనిపించును చందమామ
తెల్లచంద్రుడై ఎదురుగా ట్రాఫిక్ పొలీసు మామ !!!:-)

Tuesday, November 29, 2011

సూర్యుడా !!!

యుగము యుగము నుండి నిన్ను జగములన్ని కొలువసాగె
ధాత్రి యందు నీ మైత్రి కొరకు ఈ సుప్రభాత సెవలన్నీ..
ఓ సుర్యుడా.. ప్రభాకరుడా..కనిపించే దేవుడా.. !!!