Sunday, December 31, 2023

Happy New Year 2024

 పదండి పయనిద్దాం
కొత్త సంవత్సరంలోకి !!

మంచి జ్ఞాపకాల మూట కట్టుకొని
కొత్త ఆశల కోట కట్టుకొని

పదండి పయనిద్దాం
కొత్త సంవత్సరంలోకి !!

కలలు నిజమవ్వాలని
ఓర్పు గెలుపవ్వాలని
క్రుత్రిమ మేధ( AI ) తో సామరస్యాలు,
బంధాల్లో బలాలు, 
పసిపాపల కేరింతలు,
ప్రకృతి శాంతి మంత్రాలు ప్రజ్వరిల్లాలని


పదండి పయనిద్దాం
కొత్త సంవత్సరంలోకి !!

మంచి 
జ్ఞాపకాల మూట కట్టుకొని
 కొత్త ఆశల కోట కట్టుకొని

పదండి పయనిద్దాం
కొత్త సంవత్సరంలోకి !!


స్వాగతం పలుకుదాం
కొత్త సంవత్సరానికి !!


-శరత్

Sunday, November 19, 2023

దీపావళి (Diwali )

 

చిమ్మచీకటి కమ్ముకొచ్హేవేళ 
దారి చూపేది చిరుదివ్వె !!
కష్టాలన్ని చుట్టుముట్టేవేళ
ఆశ నింపేది చిరునవ్వు !!
చిరుదివ్వెలు , చిరునవ్వులతో
వెలుగు పంచేది దీపావళి !!

దీపావళి పండుగ  శుభాకాంక్షలు!!

- శరత్

Monday, September 18, 2023

జయ జయ జయ వినాయక

 

విఘ్నాలను తొలగించే దేవా
విన్నపాలు మన్నించే దేవా
స్వీకరించవా మా సేవ !!
సకల శుభాలను తీసుకు రావా !!

వినాయక చవితి శుభాకాంక్షలు !!

-శరత్

Tuesday, September 5, 2023

Teachers day

చిన్నారి పాపలు
చిట్టి చేతులు...
బుడి బుడి నడకలు
ముద్దు మాటలు...
వడి వడి అడుగులతో
పరిగెడుతూ వచ్చి
ఎగబడుతూ కలబడుతూ
"Happy Teachers Day" అంటుంటే
ఆనందతాండవమె చేయును మనసు
పునరంకితమే బదులు అని తెలుసు ...

- శరత్

Tuesday, August 29, 2023

రాఖి

రాఖి బంధం
అన్న చెల్లెళ్ళ, అక్క తమ్ముళ్ళ
అనిర్వచనీయతకు చిరు తార్కాణం

జీవితకాలం విడిపోలేనిది
కల్మషమన్నది యెరుగనిది
రక్షణగా నిలిచేది
అద్బుతమైనది ఈ అనుబంధం

తరాలు మారినా మారనిది
అంతరాలలో వెలిగేది
సాంప్రదాయల పెన్నిధి
ఈ రాఖి పర్వదినం

- శరత్

Monday, August 14, 2023

farewell

 రోజా పువ్వుల స్వాగతాలతో
ప్రారంభించిన వైనం
కనుల ముందుంది ఇంకా
కళకళలాడిన ఆ తరుణం

ఎంత వెగమీ కాలం.. ఎంత వెగమీ కాలం
ఈనాడిప్పుదు ఇక్కడ జరుగుతోంది  వీడ్కోలు సంబరం

నాలో కలిగిన కలవరం
అది అందుకోలేదు నా స్వరం

మొదలు కానుంది పౌరుని పర్వం
చూడాలిప్పుడు మరో జగం
కావాలందరి జీవితం ఒక్కొక్కరిది ఒక మధుర కావ్యం..

- శరత్

కళాకారుడు

 

కళాకారుడు అతడే కళాకారుడు
కళ తెలిసిన వాడు...కళ తెచ్హే వాడు
గళాన్నే పెంచి
దళాన్నే సృష్టించి ..
విప్లవాన్ని తీసుకొచ్హు
శక్తి సంపన్నుడు
కళాకారుడు అతడే కళాకారుడు

-శరత్
 
 

Saturday, April 29, 2023

శుభోదయం ..

 

నిద్ర లేచింది నయనం...
విరగబూసింది కుసుమం..
కిలకిల మని పక్షుల రావం...
బిలబిల మని జన జీవనం..
కళకళగా ప్రక్రుతి అందం..
అహా!!..ఆహ్లాదభరితం !
తూర్పు వైపు వెలుగు రేఖ
నింపునులే.. మనోబలం... !!
- శరత్


Tuesday, March 21, 2023

ఉగాది ( Ugaadi 2023 )

కళకళలను తీసుకొచ్హి
శుభాలనే మోసుకొచ్హి
షడ్రుచులను మేళవించి
నవవసంత శోభను సంతరించి ....
"శోభకృతి" నామముతో వచ్హెనులే ఉగాది
తెలుగు, కన్నడ సంవత్సరాదిని స్వాగతించెనులే ఉగాది !!


ఉగాది శుభాకాంక్షలు

- శరత్

Monday, March 13, 2023

Naatu Naatu song Oscar

 "నాటు నాటు" పాట రాటుదేలి పోయింది
రాజమౌళి బృందం ఘాటు ముద్ర వేసింది
తెలుగు చలన చిత్రం రూటు మార్చుకుంది
"అంతర్జాతీయం" అనే అందలమెక్కింది
"ఆస్కారు" గెలుచుకొని అద్భుతమే చేసింది
అమితానందాన్ని సొంతం చేసింది

- శరత్

Sunday, February 19, 2023

శుభోదయం

 ఉదయకిరణాల పలకరింపులు
ప్రకృతి లోని పులకరింపులు
పసిపాపల కేరింతలు
స్వచ్హమైన చిరునవ్వులు
పాతమిత్రుల విచారింపులు
ఇష్టమైన అభిరుచులు( passion )
"వెల" లేనివి "వల" లేనివి
విలువైనవి

- శరత్