Wednesday, May 15, 2013

అమ్మ (mother)

"అమ్మ" పదములోన ఏదో  తన్మయత్వము     
అమ్మ చేతిలోన ఉండు లాలిత్యము   
అమ్మ మనసులోన ఉండు దైవత్వము 
అమ్మ తోనే కదా స్రుష్టికి ఆది పరిచయము       
అమ్మ అందుకే అత్యంత అపురూపము.. 
- శరత్

Thursday, April 11, 2013

"విజయ" నామ "ఉగాది" !!! (ugaadi)

కొత్త చిగురు వచ్హెనని కోకిలమ్మ పాట 
కొత్త తలపు రాగానే మనసంతా ఊరట 
"విజయ" వసంతం వచ్హిన ఈ ఉగాది పూట
తెలుగువారి ప్రతి ఇంట పెద్ద ముచ్హట !! 
విజయమే మెండుగా దరి చేరాలంట !!!   

- శరత్

Friday, March 29, 2013

హోళి పండుగ

హంగుల హోళి వచ్హెను నేడు 
రంగుల కళనే తెచ్హెను చూడు
అందరు కలసి ఆనదం తో ఆడు పాడు !!
సాంప్రదాయలు తొణికిసలాడె ఈ పండుగ నాడు
- శరత్

Saturday, March 9, 2013

సైనికులారా !!! ( A Salute to Indian Army )

సైనికులారా సాహసులారా !!
"దేశభక్తి" స్ఫూర్తి నింపు నాయకులారా..!! [ 2 ]   

హ్రుదయాన  నింపుకొని హిమాలయపు విశాలం..  
భాధ్యతగా స్వీకరించి దేశరక్షణం  
ప్రాణమును పణంగ పెట్టు మీ త్యాగమె ఆదర్శం   
                                                                  
                                                                    [సై]                   
భిన్నత్వం కలిగిన మన భారతదేశం లో 
ఏకత్వపు  సాధనకై  ఎప్పుడూ పోరాటం    
నిత్య జీవనం ..అదో యుద్ధ రంగం    
మీ తలపుల ఆగమనం
కలిగించును ఉపశమనం
పెద్ద సమస్యలు అన్నవి రెప్ప పాటులో మాయం  
                                                                    [ సై]

పాలకులు , శోధకులు, సాధకులు, సామాన్యులు 
ఎంత గొప్పవారైనా ఎదో తనదైన స్వార్థం  
గుండెను గుండుకు ఎరగా పెట్టే మీ స్థైర్యం లో     
దాగివున్నదంతా అంతులేని నిస్వార్థం 
అందుకే సలాం సలాం..                                     [సై]

శరత్
( Inspiration: A wallposter showing Soldiers feats near Brigade Road Junction, Bangalore )

Thursday, February 14, 2013

ప్రేమికుల రోజు



ప్రతి బంధములో ఉన్నదిలే ప్రేమ సంబంధము

ప్రేమికులకు ఎందుకు ఒక రోజు పరిమితము !! 

మిగతా రోజులు నాకేనా ?? అని ప్రశ్నిస్తోంది..

ఒక ప్రేమ రాహిత్య అనుభవము.....



శరత్

Saturday, February 2, 2013

TV సీరియళ్ళు

TV సీరియళ్ళు  
సగటు తెలుగు ఇళ్ళల్లో..వెగటు సమస్యల పురాణాలు...
చిన్న సమస్యను పెద్దగ చూపే అర్థం లేని పరాయణాలు.. 

"చిన్నకోడలు" చిందేసిందా ? 

గోపిక గెలిచిందా?

"అత్తారింట్లో అయిదు కోడళ్ళు"    
ఆరళ్ళు సహిస్తారా తెగిస్తారా ?

"కలవారి కొడళ్ళ" నడుమ   
కల్లబొల్లి కల్లోలాలు ? 

"అగ్నిపూలు" కురిసెను ..  
"మొగిలిరేకులు" విరిసేనో.. మరి ముగిసేనో.. ?

తొలిబంధాలు, మలి బంధాలు,భవ బంధాలు
అందరు కలసి అన్నం మరిచే "అనుబంధాలు" 

భరించలేని బుస్స్ బుస్స్ శభ్దాలు.. 
చెప్పుకు పొతే ఎన్నో..   

 TV సీరియళ్ళు

అసలు సమస్యని మార్చలేని మాయా మశ్చీంద్రాలు.. 
మానవత్వపు , మంచి కుటుంబపు వికాసానికి తీవ్ర అవరోధాలు


శరత్

Saturday, January 19, 2013

దూరం

కాలం వేసెను మంత్రం
చిన్నగ మారెను లోకం
దూరం అనుకోకు నేస్తం
దరిచేరే ఆనందం కోసం 
ధ్రుఢమైన సంకల్పం కోసం
సాగనీ నీ పయనం..

- శరత్