Sunday, May 13, 2012

భెంగుళూరు

భెంగుళూరు .. భెంగలూరు
ట్రాఫిక్ ఝాముల హోరు         
నిరుద్యోగుల పోరు 
ఉద్యోగస్తుల జోరు..( అప్పుడప్పుడు బేజారు )   
నిత్యం వర్షపు నీరు..

-శరత్

ఆధునికత...ఆటవికత ...

ఆధునికత...ఆటవికత ...
ఏది ఈ లోకపు భవిత  !!!
పొటీలో ఈ జగమంతా 
నిత్యం ఉత్కంటత
మనుషుల్లోనే మృగాల చరిత 
ఆధిక్యతకై అలమటింత
                               ( ఆధునికతా..)
అత్యాధునికం మారణాయుధం
పాత కక్షల పాశవికత్వం
మానవ సంబంధాలను "money" తో
ముడిపెడుతున్న వైనం...
                              ( ఆధునికతా..)

శరత్ 

ప్రపంచ పౌరులు

ఈ ఊరు మనది కాదు
ఈ రాష్ట్రం మనది కాదు    
ఈ దేశం మనది కాదు 
ప్రపంచమే మనది
ప్రపంచ పౌరులం మనం
Software జనులారా
సత్యం కాదంటారా..
- శరత్

e-లోకం ( During my first Job )


e-లోకం లో ఎన్ని వింతలు !!!
e-లోకం లో కొత్త పుంతలు
కలుసుకోవాలంటే అది "outlook" లో 
స్వరములెన్నొ పలుకుతాయి "cubicles" లో 
                                                (e-లోకం )
గుర్తుకు వస్తాయి నాకు 
చలి చీమల దండులు
చూస్తుంటె ఇక్కడ "Team" లనే గుంపులు  
                                                 ( e-లోకం)
కష్టమేమి కాదు కొంత ఇష్టంగా మెలిగితే     
ప్రతిభ ఉంటె చూపించు "computers" లో 
వెలుగుతావు జాబిలిలా "company" లలో...
                                                ( e-లోకం )
- శరత్

రాయలసీమ

సీమ ప్రకృతి సిరులకు వెలితి
తరతరాలుగా మారెను దీని ఆక్రుతి
అలనాడు ఆ రాయల పాలన లో ప్రగతి
రత్నాలే రాసులుగా పోసినట్టి పరిస్థితి    
కక్షలు కార్పణ్యాలు , కరగని మేఘాలు
కారణాలు కాగా ఎడారిగా మారుతోంది    
నేడు దీని దుస్థితి 

శరత్

Friday, March 23, 2012

ఉగాది ..

తెలుగు వసంతం వచ్హింది ఆనంద"నందనం" గా..
ఉగాది వసంతం స్వాగతిస్తోంది అభినందన వందనం తో

- శరత్

Monday, February 27, 2012

చిన్నిపాప ప్రశ్న

అమాయకంగా చిన్నిపాప అడుగుతుంది ప్రశ్న
త్రుష్ణ తోటి పరిగెడుతూ.. ప్రశ్న మీద ప్రశ్న

ఆడే పాడే ఆటల నడుమ అల్లుకునే ప్రశ్న
ముద్దు ముద్దు మాటల నడుమ ముచ్హటైన ప్రశ్న

అటు ఇటు వెల్లొద్దంటేను భయం లెని ప్రశ్న
అవి ఇవి చెయ్యొద్దంటేను ఆకతాయి ప్రశ్న
కథను చెబుదామంటేను పదము పదము కో ప్రశ్న..
క్షణమొక ప్రశ్న,
మరియొక ప్రశ్న,
జవాబు చెప్పు ఓ క్రిష్ణ...

అమాయకంగా చిన్నిపాప అడుగుతుంది ప్రశ్న
త్రుష్ణ తోటి పరిగెడుతూ.. ప్రశ్న మీద ప్రశ్న ..

- Sarath

Saturday, January 14, 2012

సంక్రాంతి

చలి చీకట్లో భోగి మంటల కాంతి
ముంగిట్లో రంగుల ముగ్గుల కాంతి
పాడి పంటలతో పల్లె సీమల కాంతి
ఇంటింటా విరిసే నవ్వుల కాంతి
కొత్త వెన్నెలే "సంక్రాంతి"...

- శరత్

Friday, December 23, 2011

మనీ ( డబ్బు )

'మనీ' ఓ 'మనీ'
ఏమని వర్ణించను నీ మహిమని..
మహి లో ప్రతి మనిషికి నీవే ఇంధనమని..

చెప్పగలవు నీవు ఓ 'మనీ' !!
చేరువున్న వాళ్ళను చెదరిపొమ్మని..
దూరమనే వాళ్ళను దరికి రమ్మని..

సృస్టించగలవు నీవు ఓ 'మనీ' !!
స్వార్థమనె ఆయువును..
కపటమనే కల్పనని.
పొగరు అనే పౌరుషాన్ని.

పెంచేయగలవు నీవు ఓ 'మనీ' !!
ప్రమోదాన్ని ప్రమాదాన్ని

మరపింప గలవు నీవు మానవుని..
ప్రతీ మనిషి లాగా తాను ఒక మనిషినన్న నిజాన్ని..

- శరత్

Saturday, December 17, 2011

ఓర్పు ..

అమావాస్యలో కనిపించేనా ఆ నిండు జాబిల్లి
వచ్హు పుణ్ణమికి వేచి చూడాలి కాలం తో కదలి..

- శరత్

నా పెళ్ళి పత్రిక ..

హృదయాన్ని తాకె మధురానుభూతి
నా నెచ్హెలి జాడే తెలియగా ...
గగనాన్ని తాకె ఆనంద కాంతి
మా ఇంట సందడే మొదలవగా ...
వేద వాద్యాల స్వరద్వయం
శుభమంగళం పలుకగా
< date & time >
నా నవ జీవనపు సుజిత యై "సుజిత" గా
తను అడుగిడగా..
ఆశీర్వదింప రారండి నా ఆహ్వానం మన్నింపగా.. !

ఆతిథ్యం స్వీకరించండి
ఆహ్లాదాన్ని పంచగా
మరువక రా రండి !!!
మా కళ్యాణ వేడుక
తీపి గుర్తుగా .. మిగులగా ... !!!

-శరత్

Tuesday, December 13, 2011

ఊటీ ...

"పచ్హదనం" కనుచూపుమేరలో....
"చల్లదనం" చలి గిలిగింతలలో..
వర్షపు ఝల్లుల లాహిరిలో..
"వెచ్హదనం" ఛాయాచిత్రపు పలకరింపులో...
ఊటి అందాల వెలుగులలో...
- శరత్

Thursday, December 8, 2011

చందమామ పిలుపు కొత్తగా...

చాన్నాళ్ళయింది చూసి
ఓ చందమామ !!
చిన్ని పాప ఏడుపాప
చిటికె లోన రావె...
చాన్నాళ్ళయింది చూసి !

కరుగుతావు పెరుగుతావు...
ఓ ఆకాశపు మంచు బొమ్మ..
వేచి వుంది బోసి నవ్వు ..వేగంగా రావే
చాన్నాళ్ళయింది చూసి

చానళ్ళ(TV channels) మోజులో
చాంతాడు పనులతో..
రొజూ నిను చూడలేము..
అలుగకు మా....
ఓ మేఘాల ముద్దుగుమ్మ !!!
చాన్నాళ్ళయింది చూసి
చిన్ని పాప ఏడుపాప
చిటికె లోన రావె...
- శరత్

ట్రాఫిక్ సిగ్నల్.

ఎర్రచంద్రుడు ఆగమన్నాడు
ఆకుపచ్హ బాణమేసి కదల మన్నాడు
కదిలావంటె ముందుగా కనిపించును చందమామ
తెల్లచంద్రుడై ఎదురుగా ట్రాఫిక్ పొలీసు మామ !!!:-)

Tuesday, November 29, 2011

సూర్యుడా !!!

యుగము యుగము నుండి నిన్ను జగములన్ని కొలువసాగె
ధాత్రి యందు నీ మైత్రి కొరకు ఈ సుప్రభాత సెవలన్నీ..
ఓ సుర్యుడా.. ప్రభాకరుడా..కనిపించే దేవుడా.. !!!

Thursday, October 14, 2010

దసరా

రావా దసరా ... కానుకగా
వచ్హెయ్ వా సరదా వేడుకగా..
బొమ్మల కొలువుల పండుగ గా
మహిషాసుర మర్ధిని దీవెనగా..
అభినందనలే అల్లికగా..
ఆనందాలే పల్లకిగా..
రావా దసరా ... కానుకగా
వచ్హెయ్ వా సరదా వేడుకగా
..

Sunday, August 8, 2010

శుభోదయం

వేకువ ఝాము వచ్హె మేలుకొమ్మని ..
వెలుగు రేఖ పలుకరించె కొమ్మ కొమ్మ ని..
ప్రక్రుతి స్వాగతించె లేత వెలుగుని
నిద్ర మత్తు కు చెప్పు పారిపొమ్మని !!!!:)

శరత్

పెళ్ళి పత్రిక ( దినకర్ & హరిత )

ఉదయించె దినకరుడికి హరిత వర్ణ స్వాగతం
నిత్యం రమణీయం ఈ ప్రకృతి చిత్రం....
మా జీవన సరళి లో నిలవాలని అనునిత్యం...
మనువనే ముచ్చట తో ఒక్కటని ఇద్దరం.......
పెద్దల దీవెనల నడుమ ప్రతినబూను శుభతరుణం .
కళ గా కళకళ గా కళ్యాణ మందిరం,

మీ రాక మాకెంతో అనందదాయకం.
తప్పక రావాలన్నది మా చిన్న విన్నపం..........

Sunday, August 1, 2010

ఆత్మ విశ్వాసం

ఎవరూ లేరా నీకు ??
ఎందుకు లేరు ??
మౌనాన్ని గమనించు... నీతో మాట్లాడుతూ ఉంది
ఙాపకాలనే పుస్తకాలతో ...
భవిష్యత్తు అనే ప్రణాలికలతో ....
తరచి చూడు ఆ పుస్తకమిచ్హే అనుభవాల సారాన్ని

స్థిరపరచు నీ ప్రణాలికలు పయనించే గమ్యాన్ని
ఎవరూ ఎందుకు లేరు ...
అందరూ నీతోనే..
అన్నీ నీలొనే..

నిరుద్యోగి

కదులు నేస్తమా..
కలత చెందకు..
నిలువుమా నీకు ఎదురేదైనా..
నడక లోని వేగం
నీలో నవ్య శక్తి ని నింపాలి
ఉడుకుతున్న రక్తం
నిన్ను ఉప్పెన లాగ మార్చాలి
స్మరించు అలల సంద్రాన్ని
అలుపెరుగని పయనం కోసం
సంచరించు e-లోకాన్ని
నీ స్వప్నం సుసాధ్యం కోసం..
- శరత్

సంక్రాంతి

ఇంటింటా సంక్రాంతి..
ఇలలోన నవ కాంతి....
గొబ్బిల్ల ముగ్గులు...
రంగుల హరివిల్లుల్లు..
శోభతో అలరారు...పల్లెసీమ అందాలు..
భోగిమంటల సందళ్ళు..
హరిదాసు కీర్తనలు...
ఎన్నెన్నో....తెలుగుదనపు..తీపి గుర్తులు
- శరత్

శుభోదయం..

తూర్పు కిరణాలు దివిలో ...
ఓర్పు నింపులే మనలో...
నేర్పు ఉండాలని భువిలో..
తీర్పు చెప్పుకో మదిలో...

పెళ్ళి పత్రిక (సతీష్)

వచ్హింది మాతో సంతోషం..
ఇవ్వాలని పెళ్ళి ఆహ్వానం..
మన్నించి వచ్హి అందించండి
మనసైన ఆశీర్వాదం..

మనసు పరిమళించింది,
మమత పల్లవించింది,
మనువు స్వాగతిస్తోంది..శుభలేఖ తో మీ రాక ని..
ఇదిగో నవ శొభతో మా కళ్యాణపు శుభలేఖ
తప్పక రావాలన్నది మా చిన్న కొరిక.
వివాహపు శుభ సూచిక < >
విశేషపు శుభ వేదిక < >.
సాగాలి పెళ్ళింట్లో సరదా సందళ్ళు..
కురవాలి..పందిట్లో అక్షింతల ఝల్లు..
విరియాలి మా మదిలో ..ఆనందపు హరివిల్లు....

శరత్

సంగీత దినోత్సవం

రాగం తాళం ...
అంటూ పాడుతోంది లోకం..
గంధర్వ గానం..
గుర్తు చేసుకుందాం..
పాటల ప్రియులారా ,
నేడు సంగీతపు దినోత్సవం..
ఆందరికీ శుభోదయం...

శరత్

వర్షమా...

వర్షమా కురియుమా ...
కురిస్తే నీకు తెలియునులె
అందమైనదొకటున్నదని
అన్నిటిలో అది మిన్న అని
నిన్ను కురిపించు మేఘం కన్నా
నిన్ను తాకు వింఝామర కన్నా
ఇంద్రధనుస్సులో రంగుల కన్నా
నెమలి ఆడు ఆ నాట్యం కన్నా..
కనువిందొకటి ఉన్నదని
కురిస్తే నీకు తెలియునులె
రైతుల మోమున వికసించే
ఆనందమె అది అని...
- శరత్


see the link in telugukavitha.com --> prakruthi

కంప్యూటర్

ప్రపంచపథాన మరో విప్లవం
సృష్టించెను కంప్యూటర్ రంగం
కంప్యూటర్ ఒక యంత్రం
సున్నా ఒకటి మూలాధారం
అనితర సాధ్యం దీని పనితనం
వేగం దీని ఆరోప్రాణం
మనిషిని పోలిన మనిషి
మరమనిషె వీటితొ సాధ్యం
- శరత్

యువరాజ్ 6 సిక్సులు

వీరబాదుడు మోత...
వీరంగం చేసేంత..
విశ్వవిఖ్యాత చరిత..
తిరగ రాసేంత..
ఆహా!!! ఏమి అలరింత...
"యువరాజు" సాధించిన ఘనత
దేశం గర్వించేంత....

శరత్

శుభోదయం

ఆశల సౌధపు నిర్మాణం,
ప్రక్రుతి సుందర విన్యాసం,
కారు చీకట్ల కదలికనాపే
మహా మహత్తర మాయాజాలం,
ఉరకలేయు ఉత్సాహం....
సూర్యోదయం తో మొదలు

శరత్

ప్రేమికుల రోజు

గుండె లయ తప్పుతోందా.. కాదు లే గుండెపోటు .......
ఆది మనసు లో చోటు కొరకు తపన పడే ప్రేమ ఘాటు...
ఆలొచించకు నీవు అటూ ఇటూ........
గులాబి ని చేత పట్టు...
ఎక్కు ప్రేమాలయపు తొలిమెట్టు.......:-)))

శరత్

శుభోదయం..

చీకట్ల తస్కరా...
ఓ! ఉదయ భాస్కరా...
చిర్రు బుర్రు లాడకురా..
వేడిమి తగ్గించరా