Wednesday, September 25, 2019

పుట్టిన రోజు( Birthday)


పుట్టిన రోజు
మాకు పండుగ రోజు
మా ఇంట అడుగు పెట్టిన రోజు 

బోసి నవ్వులు, కేరింతలకు
పదహారెళ్ళు..నిండిన రోజు
మా మదిలో ఆనందం
సరికొత్త పరవళ్ళు..తొక్కిన రోజు
మా ముద్దుల చిన్నారి అనన్య పుట్టిన రొజు 

ఆరోగ్యం, ఐశ్వర్యం 
నీ చిరుదరహాసపు స్నేహితులై 
కలకాలం కలిసుండాలని...
నీ లక్షాలను 
సులక్షనంగా జయించాలని...
పిన్న పెద్దల అభినందనలు.. ఆశీర్వాదాలు.. 
వెల్లి విరిసే రోజు !
మా ఇంట వేడుక జరిగే రోజు !!   


శరత్


Wednesday, April 10, 2019

Happy Ugaadi 2019

Happy Ugaadi
కలలు కలలు..
మంచి జరగాలని కలలు!
కళలు కళలు..
ఆధికారం కోసం నాయకుల కళలు!
ఎన్నికలతో వచ్హెను ఉగాది పండుగ కళకళలు !!
మిన్నకుండక ఓటు వేసి ..
మన్నికైన నాయకున్ని ..
ఎన్నుకోవాలని..విన్నపాలు !!
వికారి నామ సంవత్సర
శుభాకాంక్షలు..
- శరత్

Tuesday, April 17, 2018

Asifaa ..

కన్నీరు ఆగలేదు ..
కళ్ళముందు కనిపించే 
చిన్నారి చిత్రాన్ని చూసి...
చిన్నారికి జరిగిన ఘోరాన్ని చూసి !!! 

లేత గుండె ఎంతగా విక్రుతాన్ని చూసెనో...  
మానవ మనుగడే వ్యర్థమైనంతగా 
సాధించిన ప్రగతి శూన్యమైనంతగా   !!

ఓడినాం ఓడినాం  
అగాధాన...అట్టడుగున   
పడిపొయిన ఆటవికులమైనాం 
ఈ కాలం తో ఇలా పయనిస్త్తున్నాం

గెలుపెంతో సాధించామని విర్ర వీగు హ్రుదయాలకు  
మానవత్వ సమాధి పై మ్రగ్గుతున్నామని తెలుసునా..

తల తెగ నరకాలని వచ్హే ఆవేశం చల్ల బడదు నిజమే !! 
ఇలాంటి ఘటనలు ... అసలు ఆగక పొవడము నిజమే !!

ఆలోచించండి..  !!

మనిషి చావడం కన్నా ముందే వ్యవస్త చావాలి 
మృగాలుగా మార్చే అఙ్గానం పోవాలి         

ఆడమనిషి మనిషని...
వస్తువు కానే కాదని చూసే  
సంస్కృతి రావాలి...    

శరత్

Sunday, March 18, 2018

Happy ugaadi 2018

ఉగాది మన కోసం
తెచ్హెను ఆనందం !!
పిన్న పెద్దలలో పండుగ ఆనందం..
కొత్త చిగురు అందం..
ప్రకృతి మార్పులతో పరమానందం..

ఉగాది మన కోసం
తెచ్హెను ఆరంభం !!
విళంబి నామ సంవత్సర స్వాగతారంభం

శుభాలెన్నో కలుగునని ఆశిద్దాం..

ఉగాది శుభాకాంక్షలు

శరత్

Friday, October 20, 2017

Deepaavali( Happy Diwali)

Happy Diwali

వెన్నెల వచ్హింది
నింగి నుండి నేలకు..
దివ్వెల వెలుగై !!

సంబరం హెచ్హింది
బాణాసంచాలతో
ఆనందపు తరంగమై !!

కళ కళ తెచ్హింది
దీపావళి మనకు ..
కలలు సాకారమై !!

శరత్

Tuesday, November 29, 2016

నమ్మకం ( Belief )

నేను ప్రవాహాన్ని ...
నీ ఆశల నదినై కదిలే ఒక ప్రవాహాన్ని !!
నేను సమూహాన్ని....
నీ ఆశయ సాధనలో అలుపెరుగని సైన్యాన్ని !!
నేను సమీరాన్ని....
నీ ఆనందపు జడి లో హాయిగొల్పు సమీరాన్ని!!
నేను విశాలాన్ని ...
నీ అలోచనల పరంపరను శాసించే విశాలాన్ని   !!

నేను నీ నమ్మకాన్ని... !!  
- శరత్

Sunday, October 30, 2016

Happy Diwali

Happy Diwali to All...
చిరుదివ్వెల చిరుకాంతులతో
మెరిసెనులే ముంగిళ్ళు !!
చిరునవ్వులు, చిరుచిందులతో
మురిసెనులే లోగిల్లు !!
ఆనందపు అల్లరి తో
దశదిశలా దీపావళి సందళ్ళు..!!
ఆందరికి దీపావళి శుభాకాంక్షలు..

- శరత్

Saturday, April 9, 2016

Happy ugadi

Happy Ugadi

మామిళ్ళ సందడి,
వసంతపు గారడి,
తెలుగు, కన్నడ, మరాఠి 
నూతన సంవత్సరాది
నవ్యోత్సాహము..
నవశోభతో ఉగాది   !! 
ఉగాది శుభాకాంక్షలు ..
శరత్

Friday, January 15, 2016

Happy sankraanti

సంక్రాంతి

ఆకాశపు హరివిల్లుకు,
ఆనందపు శిఖరాలకు,
ఆటల సరదాలకు,
సంక్రాంతి  వెల్లువకు!!
అద్దమాయె ముంగిళ్లు 
రంగవల్లులై

శరత్

Friday, January 1, 2016

Happy New Year 2016

కదిలే కాలపు జాడలలో
వెలుగునీడలెన్నెన్నో  
కనిపించే స్వప్నాలెన్నో...
కదిలించే ద్రుశ్యాలెన్నో..

విఙ్ఞాణపు దివ్యత్వముతో ...
విశాలపు సత్భావనతో...
గెలిపించే ధైర్యానివి కావా
కరుణించే దైవానివి కావా
నడిపించే  నేస్తానివి కావా
నడిచొచ్హే నవవసంతమా !!!

Happy New Year 2016

శరత్

Thursday, November 12, 2015

Diwali


diwali
ప్రమోదము,ప్రమిదల సరళి
ప్రతి ముంగిళిలో ప్రత్యక్షమై
వినూత్న వికాస సౌందర్యం
దిశలన్నిటా దేదీప్యమై
వేడుకలా మన ముందుకు
వచ్హెను దీపావళి పండుగై నేడు !!
అందరికీ దీపావళి శుభాకాంక్షలు...!!
- శరత్  


--

Monday, July 6, 2015

ప్రేమ ( Love )

ప్రేమ 
ఎన్నో కోట్ల అనుభవాలు ఉన్నా
ఎన్నో వేల వర్ణనలే ఉన్నా  
నిత్యనూతన సాదృశ్యముతో    
ప్రతి హ్రుదయం లో
వివిధ రూపాన..
కదిలే అంతర్వాహిని నీవు  

ప్రక్రుతి సహజత్వం లో 
మెరిసే సౌందర్యానివి నీవు ..
మనోనేత్రానికి చిరపరిచయవు

నీ కొరకై విరహ వేదనలు !
నీ కొరకై మధుర గానములు !!
అమితానందం కలిగించే..
అనంతానివే నీవు !!

"ప్రేమ"వు నీవు
!!
- శరత్

Wednesday, June 24, 2015

ఆలోచన ( Idea/Thought )


ఆలోచన ఆలోచన !
సరిక్రొత్త ఆలోచన !
ఆపకు నీ ఆలోచన !!


వేగంగా... వెలుతురులా కదిలే ఒక ఆలోచన
మౌనంగా.. మహిమలా మెదిలే ఒక ఆలోచన 
నిశితపు పరిశీలనలో కలిగే ఒక ఆలోచన   
ఆపకు దాన్నెపటికీ !!!


పాత తరపు భావాలు అడ్డు చెప్పినా
నిరాశపు సంశయాలు నిలువరించినా
నిర్భయముగ నిన్ను నమ్మి
అడుగెయ్ ముందడుగెయ్..
ఆపకు నీ ఆలోచన !!!


కూటములై రానీ ఓటములెన్నైనా 
ఓరిమి తో అడుగెయ్  
అడుగెయ్ ముందడుగెయ్..
ఆపకు నీ ఆలోచన
నీ ఆశయపు సాధన 
!!!

- శరత్
( Many people including me stop the ideas putting in to actions by giving judgements. So this poem is reminder for continuing the thought process and pursuit of goal )

Sunday, May 17, 2015

"గాంధీ"

ఆడిగాడు నన్ను ప్రశ్న కొరియా దేశస్తుడు..   
ఏ దేశం నీదని ?
కుతూహలముతో కూడిన....ఆత్మీయతతో 
మర్యాదపు భాషలో ..అడిగాడు ....
బదులిచ్హా..నేను "ఇండియన్" అని...   ( అర్థం కాలేదు )

ఇంగ్లీషు తనకి రాదు
నాకు తన భాష రాదు
సైగలే భాషలాయె మా ఇద్దరి మధ్య 
మళ్ళీ బదులిచ్హా "ఇండియన్" అని... ( అర్థం కాలేదు )          

రెండు క్షణములు.. నిడివి.
మిరుమిట్లు గొలిపేలా మెరిసెను తన మోము ..  
బ్రొటన వ్రేలితో "Thumsup" చెబుతూ చెప్పాడు .."గాంధి" అని...    
- శరత్      

Saturday, March 21, 2015

ఉగాది శుభాకాంక్షలు...

మన్మధ నామం
ఇది మల్లెల బాణం
జగమంతా నింపునులే ప్రేమ సుగంధం 
ఉగాది నవ వసంతం !
స్వాగతం సుస్వాగతం !!

ఉగాది శుభాకాంక్షలు...

- శరత్

Thursday, January 15, 2015

సంక్రాంతి శుభాకాంక్షలు


భోగ భాగ్యాల దీవెనలు
మోసుకొచ్హు భోగి పళ్ళు,   
రంగుల ముంగిళ్ళతో..
విరిసే సరికొత్త హరివిల్లు,
సాంప్రదాయాల వెల్లువతో..
మురిసే సంక్రాంతి సరదాలు, 
కలకాలం మదిలో నిలిచే కనువిందు చిత్రాలు..

సంక్రాంతి శుభాకాంక్షలు 

- శరత్ 

Wednesday, December 31, 2014

Happy New Year - 2015

నవ్వుల గలగల తో ..
వెలుగుల సిరి తో 
శుభవసంతమై..రావా..నవ వసంతమా !!
కోట్ల కలల ఆశలు 
పసిపాపల కేరింతలు
విశ్వశాంతి కపోతాలు  
నిర్విరామము గా సాగే 
శుభవసంతమై..రావా..నవ వసంతమా !!


- శరత్

Wednesday, January 1, 2014

Happy New Year 2014

ఈ నవవసంతం నాంది పలుకనీ 
నవ్వులు చెరగని నవ బంధాలకు
మంచిని కోరే మహాశయాలకు 
మార్పును తెచ్హే మహోపకరణాలకు !!

శుభ వసంతమై స్వాగతించనీ
శాంతిని పంచే సమానత్వాన్ని  
సుస్థిరమైన మానవత్వాన్ని
విశ్వవిజయ వికాసాన్ని.... 

"Welcome Happy New Year 2014"

శరత్

Wednesday, May 15, 2013

అమ్మ (mother)

"అమ్మ" పదములోన ఏదో  తన్మయత్వము     
అమ్మ చేతిలోన ఉండు లాలిత్యము   
అమ్మ మనసులోన ఉండు దైవత్వము 
అమ్మ తోనే కదా స్రుష్టికి ఆది పరిచయము       
అమ్మ అందుకే అత్యంత అపురూపము.. 
- శరత్

Thursday, April 11, 2013

"విజయ" నామ "ఉగాది" !!! (ugaadi)

కొత్త చిగురు వచ్హెనని కోకిలమ్మ పాట 
కొత్త తలపు రాగానే మనసంతా ఊరట 
"విజయ" వసంతం వచ్హిన ఈ ఉగాది పూట
తెలుగువారి ప్రతి ఇంట పెద్ద ముచ్హట !! 
విజయమే మెండుగా దరి చేరాలంట !!!   

- శరత్

Friday, March 29, 2013

హోళి పండుగ

హంగుల హోళి వచ్హెను నేడు 
రంగుల కళనే తెచ్హెను చూడు
అందరు కలసి ఆనదం తో ఆడు పాడు !!
సాంప్రదాయలు తొణికిసలాడె ఈ పండుగ నాడు
- శరత్

Saturday, March 9, 2013

సైనికులారా !!! ( A Salute to Indian Army )

సైనికులారా సాహసులారా !!
"దేశభక్తి" స్ఫూర్తి నింపు నాయకులారా..!! [ 2 ]   

హ్రుదయాన  నింపుకొని హిమాలయపు విశాలం..  
భాధ్యతగా స్వీకరించి దేశరక్షణం  
ప్రాణమును పణంగ పెట్టు మీ త్యాగమె ఆదర్శం   
                                                                  
                                                                    [సై]                   
భిన్నత్వం కలిగిన మన భారతదేశం లో 
ఏకత్వపు  సాధనకై  ఎప్పుడూ పోరాటం    
నిత్య జీవనం ..అదో యుద్ధ రంగం    
మీ తలపుల ఆగమనం
కలిగించును ఉపశమనం
పెద్ద సమస్యలు అన్నవి రెప్ప పాటులో మాయం  
                                                                    [ సై]

పాలకులు , శోధకులు, సాధకులు, సామాన్యులు 
ఎంత గొప్పవారైనా ఎదో తనదైన స్వార్థం  
గుండెను గుండుకు ఎరగా పెట్టే మీ స్థైర్యం లో     
దాగివున్నదంతా అంతులేని నిస్వార్థం 
అందుకే సలాం సలాం..                                     [సై]

శరత్
( Inspiration: A wallposter showing Soldiers feats near Brigade Road Junction, Bangalore )

Thursday, February 14, 2013

ప్రేమికుల రోజు



ప్రతి బంధములో ఉన్నదిలే ప్రేమ సంబంధము

ప్రేమికులకు ఎందుకు ఒక రోజు పరిమితము !! 

మిగతా రోజులు నాకేనా ?? అని ప్రశ్నిస్తోంది..

ఒక ప్రేమ రాహిత్య అనుభవము.....



శరత్

Saturday, February 2, 2013

TV సీరియళ్ళు

TV సీరియళ్ళు  
సగటు తెలుగు ఇళ్ళల్లో..వెగటు సమస్యల పురాణాలు...
చిన్న సమస్యను పెద్దగ చూపే అర్థం లేని పరాయణాలు.. 

"చిన్నకోడలు" చిందేసిందా ? 

గోపిక గెలిచిందా?

"అత్తారింట్లో అయిదు కోడళ్ళు"    
ఆరళ్ళు సహిస్తారా తెగిస్తారా ?

"కలవారి కొడళ్ళ" నడుమ   
కల్లబొల్లి కల్లోలాలు ? 

"అగ్నిపూలు" కురిసెను ..  
"మొగిలిరేకులు" విరిసేనో.. మరి ముగిసేనో.. ?

తొలిబంధాలు, మలి బంధాలు,భవ బంధాలు
అందరు కలసి అన్నం మరిచే "అనుబంధాలు" 

భరించలేని బుస్స్ బుస్స్ శభ్దాలు.. 
చెప్పుకు పొతే ఎన్నో..   

 TV సీరియళ్ళు

అసలు సమస్యని మార్చలేని మాయా మశ్చీంద్రాలు.. 
మానవత్వపు , మంచి కుటుంబపు వికాసానికి తీవ్ర అవరోధాలు


శరత్

Saturday, January 19, 2013

దూరం

కాలం వేసెను మంత్రం
చిన్నగ మారెను లోకం
దూరం అనుకోకు నేస్తం
దరిచేరే ఆనందం కోసం 
ధ్రుఢమైన సంకల్పం కోసం
సాగనీ నీ పయనం..

- శరత్

Monday, December 31, 2012

నవ వసంతం - 2013

నవీనా !!! 
నడువు నవదారుల్లో..
సుగంధ సుమాల సుదూరాలతో..  
ప్రశాంత వనాల దిగంతాలతో.. 
సుస్వర సంగీతపు ఝరితో.. !!! (2)

ఫ్రమోద ప్రభాతం 
ప్రపంచమంతా ప్రతిరోజూ  కనిపించేలా !!  

వినూత్న విశాల ధ్రుక్పథాలు    
విశ్వమంతా వ్యాపించేలా..!! 

ప్రళయ కాలాగ్ని జ్వాలలన్నీ  
ప్రేమ సాగరమున కలిసేలా !! 

వితండ వాదపు విషవలయాల్ని 
విశాల హ్రుదయం ఛేధించేలా..!!     

నవీనా !!!
నడువు నవదారుల్లో.. !!!

"నూతన సంవత్సర శుభాకాంక్షలు" 

- శరత్

Monday, September 17, 2012

"Life is beautiful"

ఆనందపు జీవితాన్ని
అందంగా చిత్రించి
కొత్తదనపు ఒరవడికి
మారుపేరు గా నిల్చి 
సున్నితపు భావాలను
సుందరంగ పేర్చి
సాదృస్యపు సొగసును
సమపాల్లలో అందించిన 
శేఖర్ కమ్ముల "Life is beautiful"     
movie looks beautiful

- శరత్

"చెలిమి"

ప్రకృతికి రాత్రి , పగలున్నట్లు
మనసుకి దిగులు ఆనందాలు
సూర్యుడంటి "చెలిమి" తోడుంటే   
దరి నిల్చునులే ఆనందపు కలిమి
-శరత్

Wednesday, August 29, 2012

తెలుగు దినోత్సవం

అనరా కమ్మని తెలుగు పదాలు
వినరా తీయ్యని తేనె పదాలు
సుందర సుమధుర జాన పదాలు
ప్రాచీనాంధ్రపు తెలుగు వెలుగులు
మనసారా అందరికి "తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు"

- శరత్ 

Sunday, July 15, 2012

ఈగ

ఈగ ఈగ ఈగ...
రాజమౌళి "ఈగ"
మంచి చిత్రాల సరళిలో వేసుకొంది పాగా.. 
తెలుగు సినీ ప్రపంచం గర్వించే లాగా.. 
సినిమా ఉన్నదిలే భలే అద్బుతంగా..
కనులవిందుగా !! సరదా సరదాగా !!

శరత్