Monday, October 14, 2024

దసరా..

 

డాండియా ఆటలతో శోభ తెచ్హె దసరా!
కనకదుర్గ దీవెనలతో సొభగులొసగె దసరా..!!
భారతీయ సాంప్రదాయ
భావం ఈ దసరా
ఆట పాటల సరదా,
బొమ్మల కొలువుల పరదా..
వారాంతపు వికాసముగ 
వచ్హెనులే దసరా.. !!

దసరా పండుగ శుభాకాంక్షలు 

-శరత్

తొలి ఉషస్సు

 

తొలి ఉషస్సు.. తొలి తొలి ఉషస్సు
అహా ఏమి తేజస్సు !!
ప్రకృతిలో నవ వర్చస్సు
వర్ణింప తగునా ఏ చంధస్సు !!
నిత్యాన్వేషణలో మానవ మేధస్సు
సూర్యుడా నీకు నమస్సు !!

- శరత్

మండుటెండ

 

ఏరు ఎండిపోతోంది
గుండె జారిపోతోంది
మండుటెండ పొగరుగా వెక్కిరిస్తోంది !!
అలిగిందేమో మేఘం దూరంగా ఉంది
ఆశగా ఆకాశం ..
సంధ్యగాలితో కలిసి సంధి చేస్తోంది 

జాలువారు వాన కొరకు ప్రతి ప్రాణం వేచి వుంది !!

- శరత్

Ugaadi ( krodhi )

 ఉగాది 

కొత్త చిగురు అందం
కొత్త ఆశల ఆనందం
కోయిల పాట మాధుర్యం
షడ్రుచుల సమ్మేళనం  
నవ వసంతపు శోభాయమానం 
అచ్హమైన తెలుగుదనం
ఉగాది పండుగ సొంతం
"క్రోధి" సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం
- శరత్