నేను ఒక కవితాన్వేషిని అభిలాషిని...
నా పేరు శరత్ , అనంతపురం నుండి... వ్రుత్తి రిత్యా...బెంగుళూరు... నా చిన్ని కవితలను ... వీక్షించండి...
Monday, October 14, 2024
దసరా..
తొలి ఉషస్సు
మండుటెండ
Ugaadi ( krodhi )
ఉగాది
Sunday, December 31, 2023
Happy New Year 2024
పదండి పయనిద్దాం
కొత్త సంవత్సరంలోకి !!
పదండి పయనిద్దాం
కొత్త సంవత్సరంలోకి !!
కలలు నిజమవ్వాలని
ఓర్పు గెలుపవ్వాలని
క్రుత్రిమ మేధ( AI ) తో సామరస్యాలు,
బంధాల్లో బలాలు,
ప్రకృతి శాంతి మంత్రాలు ప్రజ్వరిల్లాలని
పదండి పయనిద్దాం
కొత్త సంవత్సరంలోకి !!
మంచి జ్ఞాపకాల మూట కట్టుకొని
పదండి పయనిద్దాం
కొత్త సంవత్సరంలోకి !!
స్వాగతం పలుకుదాం
కొత్త సంవత్సరానికి !!
-శరత్
Sunday, November 19, 2023
దీపావళి (Diwali )
Monday, September 18, 2023
జయ జయ జయ వినాయక
Tuesday, September 5, 2023
Teachers day
చిట్టి చేతులు...
బుడి బుడి నడకలు
ముద్దు మాటలు...
వడి వడి అడుగులతో
పరిగెడుతూ వచ్చి
ఎగబడుతూ కలబడుతూ
"Happy Teachers Day" అంటుంటే
ఆనందతాండవమె చేయును మనసు
పునరంకితమే బదులు అని తెలుసు ...
- శరత్
Tuesday, August 29, 2023
రాఖి
రాఖి బంధం
అన్న చెల్లెళ్ళ, అక్క తమ్ముళ్ళ
అనిర్వచనీయతకు చిరు తార్కాణం
జీవితకాలం విడిపోలేనిది
కల్మషమన్నది యెరుగనిది
రక్షణగా నిలిచేది
అద్బుతమైనది ఈ అనుబంధం
తరాలు మారినా మారనిది
అంతరాలలో వెలిగేది
సాంప్రదాయల పెన్నిధి
ఈ రాఖి పర్వదినం
- శరత్
Monday, August 14, 2023
farewell
రోజా పువ్వుల స్వాగతాలతో
ప్రారంభించిన వైనం
కనుల ముందుంది ఇంకా
కళకళలాడిన ఆ తరుణం
ఎంత వెగమీ కాలం.. ఎంత వెగమీ కాలం
ఈనాడిప్పుదు ఇక్కడ జరుగుతోంది వీడ్కోలు సంబరం
నాలో కలిగిన కలవరం
అది అందుకోలేదు నా స్వరం
మొదలు కానుంది పౌరుని పర్వం
చూడాలిప్పుడు మరో జగం
కావాలందరి జీవితం ఒక్కొక్కరిది ఒక మధుర కావ్యం..
- శరత్
కళాకారుడు
కళ తెలిసిన వాడు...కళ తెచ్హే వాడు
గళాన్నే పెంచి
దళాన్నే సృష్టించి ..
విప్లవాన్ని తీసుకొచ్హు
శక్తి సంపన్నుడు
Saturday, April 29, 2023
శుభోదయం ..
Tuesday, March 21, 2023
ఉగాది ( Ugaadi 2023 )
కళకళలను తీసుకొచ్హి
శుభాలనే మోసుకొచ్హి
షడ్రుచులను మేళవించి
నవవసంత శోభను సంతరించి ....
"శోభకృతి" నామముతో వచ్హెనులే ఉగాది
తెలుగు, కన్నడ సంవత్సరాదిని స్వాగతించెనులే ఉగాది !!
Monday, March 13, 2023
Naatu Naatu song Oscar
"నాటు నాటు" పాట రాటుదేలి పోయింది
రాజమౌళి బృందం ఘాటు ముద్ర వేసింది
తెలుగు చలన చిత్రం రూటు మార్చుకుంది
"అంతర్జాతీయం" అనే అందలమెక్కింది
"ఆస్కారు" గెలుచుకొని అద్భుతమే చేసింది
అమితానందాన్ని సొంతం చేసింది
- శరత్
Sunday, February 19, 2023
శుభోదయం
ఉదయకిరణాల పలకరింపులు
ప్రకృతి లోని పులకరింపులు
పసిపాపల కేరింతలు
స్వచ్హమైన చిరునవ్వులు
పాతమిత్రుల విచారింపులు
ఇష్టమైన అభిరుచులు( passion )
"వెల" లేనివి "వల" లేనివి
విలువైనవి
- శరత్
Saturday, December 31, 2022
Happy New Year 2023
తరిగిపోవాలని
సమరనాదాలు, మహమ్మారి మాయలు !!
నిరాశలు, నిట్టూర్పులు !!
మనుషుల్లో పైశాచికాలు !!
పెరుగుతూ ఉండాలని
సామరస్యాలు,
ఓర్పులు, నేర్పులు !!
బంధాల్లో బలాలు
పసిపాపల ఆట పాటలు
విశ్వ శాంతి మంత్రాలు !!
-శరత్
Thursday, November 17, 2022
Monday, October 24, 2022
Happy Diwali ..( దీపావళి శుభాకాంక్షలు)
కరిగిపొవాలి చీకట్లు , ఇక్కట్లు !!
దరికి చేరాలి విజయాలు..!!
చిరుదివ్వెలు వెలిగించునులే వెన్నెలలు ..
చిరునవ్వులు సాధించునులే విజయాలు
దీపావళి తో జరుపుకుందాము సందళ్లు
స్వాగతిద్దాము ముంగిళికి విజయాలు
దీపావళి శుభాకాంక్షలు !!
-శరత్
Saturday, July 23, 2022
Ugaadi 2022
కొత్త చిగురు అందం
కొత్త ఆశల ఆనందం
షడ్రుచుల సాంప్రదాయం
నవ వసంత సందర్భం
ఉగాదికి స్వాగతం !!
కట్టుబాట్లకు తిలోదకం
ఉక్రైన్ యుద్దం
గర్జించిన RRR చిత్రం
ఇది నేటి ప్రపంచం
శుభాలెన్నో కలగాలని ఆశిద్దాం
స్వాగతం "శుభకృతి" నామ సంవత్సరం
ఉగాది శుభాకాంక్షలు
- శరత్
Sunday, February 27, 2022
Happy New Year 2022...
Happy New Year 2022...
కొత్త సంవత్సరం
కొత్త ఆశలతో స్వాగతం
భయం వీడి జయం వైపు అడుగిడాలని
పెరుగుతున్న డోసులు తరిగిపోవాలని
నలుగుతున్న బ్రతుకులు బాగు కావాలని
అసహనాల తీవ్రం అంతరించి..
క్షణ వీక్షణాలలో గురి పెరగాలని !!
కుగ్రామే ప్రపంచం నేడు...
దుష్ప్రచార దావానలం ఆగాలని
మనుషులు కలిసే దోషం తొలగిపోవాలని
పసిపాపల నవ్వులు...
ప్రకృతి శాంతి మంత్రాలు ప్రజ్వరిల్లాలని
స్వాగతం ఓ 2022
శరత్
Friday, December 3, 2021
సిరివెన్నెల
ఒకటా!... రెండా!! చెప్పడానికి ..
వందలు!.. వేలే.!!.. పొగడడానికి..
సిరివెన్నెల వెలిగించిన పాటలు
జగానికే వెలుగిచ్హిన పాటలు
కదిలించి.. రగిలించిన పాటలు
మురిపించి.. మరిపించిన పాటలు
"విధాత తలపుల" నుండి "సామజవరగమన" వరకు
ఒక్కో పాట భావ గ్రంధమే..
తెలుగు వెలుగును పెంచే ఆణిముత్యమే !!
పాటల రైతు అలసిపొయాడు
కలం వీరుడు కనుమరుగయ్యాడు
భావ శూన్యపు చీకటికి వెలుగునిచ్హేందుకేమో ..
నింగికెగసి సూర్యుడయ్యాడు
- శరత్
Tuesday, November 16, 2021
Happy Ugadi 2021
Happy New Year 2021 !!
SPB
Friday, January 17, 2020
Happy Sankranthi (సంక్రాంతి శుభాకాంక్షలు)
సరిక్రొత్త "దర్బారు" లా !!
రైతన్నల రంగుల కల
ముంగిళ్ళలో
రంగవల్లుల కళ
పిన్నపెద్దల నవ్వుల కళ కళ ..
ఈ భోగి, సంక్రాంతి ,కనుమల మేళా !!
Wednesday, January 1, 2020
Happy New Year 2020
20-20 ఆడుతున్నట్లుంది కాలం
అప్పుడే వచ్హెను 2020 సంవత్సరం..
స్వాగతం సుస్వాగతం
ఓ నవ వసంతమా.. స్వాగతం !!
కాలపు కదలిక లో కనిపించును
ఎన్నో వెలుగు నీడల మజిలీలు !
కావాలి ఆశల నమూనాలు
స్వీకరించేందుకు అసౌకర్యపు నిజాలు !!
నిరాశ నిస్పృ హ లను పారద్రోలె
బలాన్ని ఇవ్వు...
మానవత్వపు పరిమళాల్ని
పసి పాపల బోసి నవ్వుల్ని.
లోక కళ్యాణపు కాంతుల్ని
స్వాగతం సుస్వాగతం !!
Wednesday, September 25, 2019
పుట్టిన రోజు( Birthday)
పుట్టిన రోజు
మాకు పండుగ రోజు
మా ఇంట
బోసి నవ్వులు, కేరింతలకు
పదహారెళ్ళు..నిండిన రోజు
మా మదిలో ఆనందం
సరికొత్త పరవళ్ళు..తొక్కిన రోజు
మా ముద్దుల చిన్నారి అనన్య పుట్టిన రొజు
ఆరోగ్యం, ఐశ్వర్యం
నీ చిరుదరహాసపు స్నేహితులై
కలకాలం కలిసుండాలని...
నీ లక్షాలను
సులక్షనంగా జయించాలని...
పిన్న పెద్దల అభినందనలు.. ఆశీర్వాదాలు..
వెల్లి విరిసే రోజు !
మా ఇంట వేడుక జరిగే రోజు !!
శరత్
Wednesday, April 10, 2019
Happy Ugaadi 2019
మంచి జరగాలని కలలు!
ఆధికారం కోసం నాయకుల కళలు!
మన్నికైన నాయకున్ని ..
ఎన్నుకోవాలని..విన్నపాలు !!
శుభాకాంక్షలు..
Tuesday, April 17, 2018
Asifaa ..
కళ్ళముందు కనిపించే
చిన్నారి చిత్రాన్ని చూసి...
చిన్నారికి జరిగిన ఘోరాన్ని చూసి !!!
లేత గుండె ఎంతగా విక్రుతాన్ని చూసెనో...
మానవ మనుగడే వ్యర్థమైనంతగా
సాధించిన ప్రగతి శూన్యమైనంతగా !!
ఓడినాం ఓడినాం
అగాధాన...అట్టడుగున
పడిపొయిన ఆటవికులమైనాం
ఈ కాలం తో ఇలా పయనిస్త్తున్నాం
గెలుపెంతో సాధించామని విర్ర వీగు హ్రుదయాలకు
మానవత్వ సమాధి పై మ్రగ్గుతున్నామని తెలుసునా..
తల తెగ నరకాలని వచ్హే ఆవేశం చల్ల బడదు నిజమే !!
ఇలాంటి ఘటనలు ... అసలు ఆగక పొవడము నిజమే !!
ఆలోచించండి.. !!
మనిషి చావడం కన్నా ముందే వ్యవస్త చావాలి
మృగాలుగా మార్చే అఙ్గానం పోవాలి
ఆడమనిషి మనిషని...
వస్తువు కానే కాదని చూసే
సంస్కృతి రావాలి...
శరత్
Sunday, March 18, 2018
Happy ugaadi 2018
తెచ్హెను ఆనందం !!
పిన్న పెద్దలలో పండుగ ఆనందం..
కొత్త చిగురు అందం..
ప్రకృతి మార్పులతో పరమానందం..
ఉగాది మన కోసం
తెచ్హెను ఆరంభం !!
విళంబి నామ సంవత్సర స్వాగతారంభం
శుభాలెన్నో కలుగునని ఆశిద్దాం..
ఉగాది శుభాకాంక్షలు
శరత్